YS Sharmila : హుజూరాబాద్ ఉపఎన్నికపై వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం తనకే బెడిసికొట్టిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : హుజూరాబాద్ ఉపఎన్నికపై వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం తనకే బెడిసికొట్టిందా?

YS Sharmila  తెలంగాణా Telangana వైఎస్సార్టీపీ Ysrtp అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయాయి. త్వరలో జరిగే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీఆర్, మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి. ప్రధాన పార్టీలు ఇంత హడావుడిగా […]

 Authored By sukanya | The Telugu News | Updated on :18 August 2021,2:59 pm

YS Sharmila  తెలంగాణా Telangana వైఎస్సార్టీపీ Ysrtp అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయాయి. త్వరలో జరిగే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీఆర్, మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి. ప్రధాన పార్టీలు ఇంత హడావుడిగా ఉండగా మరి మిగిలిన పార్టీలు ఏమి చేస్తున్నాయి ? ఏమి చేస్తున్నాయంటే కేవలం ఉనికికోసం నానా అవస్తలు పడుతున్నాయి.

మిగిలిన పార్టీలను వదిలిస్తే వైఎస్సార్టీపీ Ysrtp అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్ధితే మరీ అయోమయంగా తయారైంది. అసలా పార్టీ గురించి పట్టించుకుంటున్న వారే కనబడటంలేదు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, వెంటనే ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో దీక్షలు చేసిన ఆమె ఈరోజు మహబూబ్ నగర్ లో నిరాహారదీక్షకు రెడీ అయ్యారు. గూడూరు మండలంలోని గుండెంగ గ్రామాన్ని తన దీక్షకు షర్మిల వేదికగా చేసుకున్నారు. ఇదేసమయంలో ప్రధాన పార్టీలన్నీ దళితబంధు పథకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పథకాన్ని కేసీయార్ హడావుడిగా ప్రారంభించటానికి కారణమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు కాక మీద ఉన్నాయి..

Ys Sharmila

Ys Sharmila

పార్టీ పట్ల.. YS Sharmila

అయితే వైఎస్ షర్మిల మాత్రం హుజూరాబాద్ బైపోల్ పై కనీసంగానైనా స్పందించకపోవడంతో ఆమె పార్టీని అందరూ లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం దళితబంధు పథకం గానీ, బైపోల్ గానీ తనకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికతో పేదలకు ఒరిగేదేం లేదని, పోటీ చేయడం లేదని ప్రకటించడంతో వైఎస్ఆర్టీపీ పై సెటైర్లు చెలరేగాయి.. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరైనా నిరుద్యోగి పోటీచేస్తే సహకరిస్తామనే ఓ ప్రకటన ఇచ్చేసి ఊరుకున్నారు. ఇక ఉపఎన్నికలో ఎలాగూ పోటీచేసేది లేదుకాబట్టి దళితబంధు పథకం విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు.

ys sharmila

ys sharmila

దాంతో షర్మిల గురించి ఆలోచించే జనాలే కనబడటంలేదు. తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్, దళిత బంధు కాక రేపుతుంటే, తనకేం పట్టనట్లు దీక్షలు చేస్తాననడం.. పార్టీకి పెద్దగా మైలేజ్ ఇవ్వడం లేదన్న వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో వైఎస్ షర్మిల కేవలం తెలంగాణలో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు మాత్రమే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుందన్నటాక్ వెల్లువెత్తుతోంది. మరి ఇప్పటికైనా వైఎస్ షర్మిల వ్యూహం మార్చుకుంటారేమో వేచి చూడాల్సిందే.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది