Ys jagan : ఏపీలో హుజురాబాద్ సీన్ రిపీట్.. బడా లీడర్లకు చెక్ పెట్టబోతున్న వైఎస్ జగన్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys jagan : ఏపీలో హుజురాబాద్ సీన్ రిపీట్.. బడా లీడర్లకు చెక్ పెట్టబోతున్న వైఎస్ జగన్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :1 December 2021,9:00 pm

Ys jagan : ఏపీ రాజకీయాల్లో కొత్తగా మరో అంశం తెరమీదకు వచ్చింది. మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో్ భాగంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. క్రమంగా అది కాస్త వైసీపీ నుంచి డైవర్ట్ అయ్యి టీడీపీ లీడర్లు వర్సెస్ నందమూరి ఫ్యామిలీగా రూపాంతరం చెందింది. దీనంతటికీ అసెంబ్లీలో చంద్రబాబును వైసీపీ లీడర్లు దూషించడం, ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై కామెంట్స్ చేయడమే కారణంగా తెలిసింది. సొంత మేనత్తపై అంతలా కామెంట్స్ చేసినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టీడీపీ లీడర్ వర్ల రామయ్య కామెంట్స్ కూడా ఒకింత గొడవను పెద్దగా చేశాయి. ఇదంతా ఓవైపయితే తాజాగా ఏపీలో హుజురాబాద్‌ను పోలిన ఎన్నికలు రాబోయే రెండేళ్లలో మన కళ్లముందు కదలాడనున్నట్టు తెలుస్తోంది.

రెండున్నరేళ్లలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో జగన్ భీమవరం నియోజవర్గం మరియు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేయనున్నారని టాక్. అలాగే పక్కలో బళ్లెంగా తయారైన నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజును ఓడించాలంటే అక్కడ నాయకులకు భారీగా పదవులను ఎర వేస్తున్నట్టు తెలిసింది. మొన్న జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూడా ఈటల అనుచరులకు భారీగా పదవులను కట్టబెట్టి రాజేందర్‌ను ఒంటరి చేశాడు. అయినా ఎన్నికల్లో టీఆర్ఎస్ పాచికలు పారలేదు. కానీ, నాయకులు మాత్రం లాభపడ్డారు. ఈ సూత్రాన్నే సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రస్తుతం ఫాలో అవుతున్నారట..

huzurabad scene repeat in ap

huzurabad scene repeat in ap

Ys jagan : వారిద్దరికీ చెక్ పెట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ కొత్త స్కెచ్..

అక్కడున్న క్షత్రియ, కాపు కులస్తులను ఆకట్టుకోవడానికి పదవులను ఎరగా వేస్తున్నారట.. ఇప్పటికే భీమవరం చెందిన నేతల మోషేన్ రాజును మండలి చైర్మన్ గా నియమించారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా పాతపాటి సర్రాజు, జడ్పీ చైర్మన్ గా కవురు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ గా పీవీఎల్ నరసింహరాజు, డీఎస్ఎంఎస్ చైర్మన్ గా వెంకటస్వామిలకు అవకాశం కల్పించిన జగన్.. మిగతా వారిని కూడా సాధ్యమైనంత వరకు లాగేయాలని చూస్తున్నారట.. ఎందుకంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు చాలా ముఖ్యం. 60కు పైగా అసెంబ్లీ స్థానాలు ఇక్కడి నుంచే ఉన్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది