డ్రగ్స్ కేసు.. మీడియాలో కథనాలతో ఆమె మనోవేదనకు గురయ్యి ఆత్మహత్య యత్నం
హైదరాబాద్ డ్రగ్స్ కేసు విషయం లో ఇటీవల మీడియా వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. అక్కడ దాదాపు 145 మంది పట్టు బడ్డారు. వారందరూ కూడా దోషులు అన్నట్లుగా మీడియాలో చూపించడంతో చాలా మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఆ 145 మంది లో ఐదు నుండి పది మందికి డ్రగ్స్ తో సంబంధం ఉండి ఉంటుంది. కానీ మిగతా వారంతా కూడా ఆ డ్రస్ బాధితులే అయ్యారు. వారందరూ కూడా డ్రగ్స్ తీసుకుని పార్టీలు ఎంజాయ్ చేస్తున్నట్లు గా తెలుగు మీడియా ఫోకస్ చేసింది. ఎంతో మంది అమ్మాయిలు మరియు ఉన్నత కుటుంబానికి చెందిన అబ్బాయిలు ఆ సమయంలో అక్కడ ఉండడంతో వారందరి పరువు కూడా గంగపాలు అయింది.
అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నడుస్తున్న పబ్ కు లేట్ నైట్ సమయంలో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. పబ్బు నిర్వాహకులపై మాత్రమే కేసు నమోదు చేశారు. కానీ మీడియా వారు మాత్రం పబ్బు నిర్వాహకుల గురించి పట్టించుకోకుండా కేవలం ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేసింది. అది కాకుండా సోషల్ మీడియాలో మరియు ఇతర గుర్తింపు ఉన్న సెలబ్రెటీలపై ఎక్కువ ఫోకస్ చేసి వారి పేర్లతో సహా ఫోటోలతో సహా ప్రచురించి ప్రచారం చేసి వారి పరువు తీసిన అంత పని చేశారు. దాంతో సోషల్ మీడియాలో కొద్ది గొప్ప క్రేజ్ ఉన్న ఒక అమ్మాయి ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంటూ ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

Hyderabad drugs case one girl try to sucide
మీడియాలో వస్తున్న కథనాల వల్ల తన కుటుంబ సభ్యులకు తన మొహం చూపించలేక పోతున్నాను. అందుకే చనిపోవాలనిపిస్తుంది అంటూ ఆమె తమ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది అంటూ ఆ సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఎవరు అనే విషయం పక్కన పెడితే ఇలా ఎంతో మంది కూడా మీడియాలో వస్తున్న కథనాల వల్ల ఇప్పుడు ఆత్మహత్య వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సంయమనం పాటిస్తూ ఇలాంటి కథనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.