Drive In Theater : హైదరాబాద్‌లోను డ్రైవ్ ఇన్ థియేటర్.. చక్కగా కారులో కూర్చొనే సినిమా చూసే ఛాన్స్
Drive in Theater : కరోనా వచ్చాక సినిమా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్ ల విషయంలో మార్పులు జరుగుతున్నాయి. క్లోజ్‌డ్ రూంలో కూర్చుంటే కరోనా సోకే అవకాశం ఉన్ననేపథ్యంలో డ్రైవ్ ఇన్ థియేటర్ అంతటా అమలు అవుతుంది. తెలంగాణ.. త్వరలోనే తొలి డ్రైవ్ ఇన్ థియేటర్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సీరియస్గా తీసుకుంటున్నారు. దీనిపై చర్చోప చర్చలు చేస్తున్నా రు. ఓ ఆర్ ఆర్కు సమీపంలో ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ను ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అధికార వర్గాల నుంచి సమాచారం. ఓ ఆర్ ఆర్కు సమీపంలో డ్రైవ్ ఇన్ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలం చూడాలని ఆయన అధికారులను కూడా ఆదేశించిన ట్టు తెలిసింది.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఎక్కడా వాహనదారులు సేద తీరేందుకు అనువైన ప్రదేశాలు లేవు. కనీసం ఒక్క పెట్రోల్ బంక్ లేదు. హోటల్స్, రెస్టారెంట్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఔటర్‌పై అక్కడక్కడా హోటల్స్, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. ముంబై, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లోలాగా డ్రైవ్ ఇన్ థియేటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
Drive in Theater : సరికొత్త అనుభూతి…
డ్రైవ్ ఇన్థియేటర్ను ఏర్పాటు చేయాలంటే.. మొత్తం 150 ఎకరాల స్థలం అవసరం అవుతుందని.. మంత్రి కేటీఆర్కు అధికారులు సూచన ప్రాయంగా తెలిపారు. అదేసమయంలో అధునాత హంగులకు కూడా అవకాశం ఉంటుందన్నారు. ఎంత ఖర్చయినా.. దీనిని ఏర్పాటు చేయాలని.. మంత్రి కేటీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ థియేటర్ ద్వారా హైదరాబాద్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ ఎలా ఉంటుందంటే.. నిర్దేశిత స్థలంలో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేస్తారు. ఈ తెరపై నిర్ణీత సమయంలో సినిమాలు ప్రదర్శించనున్నారు.