ప్రస్తుతం మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకపక్క టెక్నాలజీ పెరుగుతున్న మరోపక్క జనాలు కొన్ని విషయాలలో అజ్ఞానంగానే ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద చదువులు చదివిన కొన్ని విషయాలలో ఆ జ్ఞానాన్ని ప్రదర్శించలేరు. దీంతో జనాలని మోసం చేసేలా ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను నమ్మి ఎంతోమంది మోసపోతున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసేవారు ఎప్పుడు ఉంటనే ఉంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది అసలు జనకన్యలు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. అలాంటిది కోట్ల విలువ చేసే జలకన్య కన్ను ఇది మీ ఇంట్లో
ఉంటే డబ్బే డబ్బు అంటూ మోసగాళ్లు రంగంలోకి దిగారు. జనాలను మోసం చేయాలనుకున్న వాళ్లు చివరికి పోలీసులకు పట్టు పడ్డారు. ఈ సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కాజీపేట కు చెందిన చందు అనే 30 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మల్కాజిగిరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అల్వాల్ కి చెందిన తాపీ మేస్త్రి మడికొండ సాంబశివరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి డబ్బు కావాలి.
చిన్న ఉద్యోగాలతో డబ్బు సంపాదించడం కష్టమని ఆలోచించారు. దీంతో ఇద్దరు కలిసి జనాలను మోసం చేయడానికి ప్లాన్ వేశారు. ఇద్దరు కలిసి జలకన్య కన్ను ఇది లక్కీ స్టోన్, దీనికి అద్భుత శక్తులు ఉన్నాయి. మీ ఇంట్లో ఉంటే మంచిది. మార్కెట్లో దీని విలువ రెండు కోట్లు, కానీ తాము తక్కువ ధరకే ఇస్తామని జనాలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ లక్కీ స్టోన్ సమాచారం కాస్త పోలీసులకు తెలియడంతో ఆ ఇద్దరిని పట్టుకొని పోలిసులు విచారించారు. వారి వద్ద నుండి జలకన్య కన్ను అనుకుంటున్న వస్తువు, మూడు మొబైల్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.