
#image_title
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా లాంచ్ చేసింది. ఐఫోన్ 17 లో ప్రొ మోషన్‌తోపాటు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ డిస్‌ప్లేపై యూజర్లు టైమ్, విడ్జెట్స్, లైవ్ యాక్టివిటీలను ఎప్పటికప్పుడు సులభంగా చెక్ చేసుకోవచ్చు.ఇది యాపిల్ ఎ15 బయానిక్ ప్రాసెసర్ కన్నా 1.5 రెట్లు వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలియజేసింది.
#image_title
మంచి ఫీచర్స్ తో..
ఈ ఫోన్‌లో వైఫై 7తోపాటు బ్లూటూత్ 6 లభిస్తుంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే మరో 48 మెగాపిక్సల్ ఆప్టికల్ క్వాలిటీ 2ఎక్స్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 18 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
ఐఫోన్ 17కు గాను డిస్‌ప్లేకు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే దృఢంగా ఉంటుంది. ఈ ఐఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. యూఎస్‌టీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. 40 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ను కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 17ను 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఐఫోన్ 17ను బ్లాక్, వైట్, మిస్ట్ బ్లూ, సేజ్, లావెండర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో 128జీబీ మోడల్ లేదు. ఇక ఐఫోన్ 17కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.82,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,02,900గా ఉంది. ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.