IDBI Jobs : ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IDBI Jobs : ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

 Authored By ramu | The Telugu News | Updated on :8 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  IDBI Jobs : ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI Jobs : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 6 నవంబర్ 2024న ఎగ్జిక్యూటివ్ పోస్టుల (సేల్స్ మరియు ఆపరేషన్స్) కోసం 1000 ఖాళీలను ప్రకటిస్తూ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. IDBI ఎగ్జిక్యూటివ్ 2024 నోటిఫికేషన్ అనేది రిజిస్ట్రేషన్ తేదీ, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా సరళి మొదలైన అన్ని సంబంధిత సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/కు లాగిన్ అయి తెలుసుకోవ‌చ్చు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

IDBI Jobs ఖాళీల వివరాలు

– ఎగ్జిక్యూటివ్ : 1000 (యూఆర్‌- 448; ఎస్టీ- 94; ఎస్సీ- 127; ఓబీసీ- 231; ఈడబ్ల్యూఎస్‌- 100)
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి : 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు : నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.
దరఖాస్తు రుసుము : రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ : ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

IDBI Jobs ప‌రీక్షా విధానం

లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు),
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్/ (60 ప్రశ్నలు- 60 మార్కులు).
మొత్తం ప్రశ్నల సంఖ్య : 200. మొత్తం మార్కులు 200.
పరీక్ష కాల వ్యవధి : 120 నిమిషాలు.

IDBI Jobs ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI Jobs : ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ముఖ్యమైన‌ తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు/ సవరణ తేదీలు : 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు : 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 01-12-2024.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది