Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2025,10:00 am

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా పదార్థాలతోనే బరువు తగ్గొచ్చు.

అల్లంతో బరువు తగ్గడం ఎలా?

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు పాలు, పంచదార లేని అల్లం టీ తాగడం వల్ల మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం ఇలా వారం రోజుల పాటు తాగితే బరువులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

#image_title

అల్లం డీటాక్స్ వాటర్‌ను పరగడుపున తాగితే కూడా వేగంగా బరువు తగ్గొచ్చు. దీనికి ఒక గ్లాసు నీటిలో చిన్న ముక్క అల్లం వేసి మరిగించాలి. తర్వాత దాన్ని చల్లార్చి, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇంట్లో చేసుకునే ఈ చిన్న మార్పులు బరువు తగ్గడంలో సహాయపడతాయి. అయితే వీటితో పాటు రోజూ కనీసం 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ (వాకింగ్, యోగా, వ్యాయామం) ఉంటే ఫలితం మరింత వేగంగా కనిపిస్తుంది.

బరువు తగ్గాలని అనుకుంటే ఖర్చుతో కూడిన డైట్‌లు, రిస్కీ సప్లిమెంట్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇంట్లోని అల్లం, నిమ్మ వంటి సులభమైన పదార్థాలతో, కొద్దిగా శ్రమతో ఆరోగ్యంగా బరువు తగ్గడం సాధ్యమే. ఈ మార్గాలు సహజమైనవే కావడంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది