Goat leg curry : మేక కాళ్ళ కూర తింటే చలికి వచ్చే జలుబులు పారిపోవాల్సిందే… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Goat leg curry : మేక కాళ్ళ కూర తింటే చలికి వచ్చే జలుబులు పారిపోవాల్సిందే…

Goat leg curry : ఈ చలికాలంలో చాలామందికి జలుబులు, దగ్గు, లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి జలుబులు డబ్బులు తగ్గడానికి మేక కాళ్ళ పులుసు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే జలుబు ఇక పారిపోవాల్సిందే…ఈ మేక కాళ్ల కూరకి కావాల్సిన పదార్థాలు:మేక కాళ్లు, పసుపు, కారం, ఉప్పు , గరం మసాల ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కాయలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు, గసగసాలు ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర […]

 Authored By saidulu | The Telugu News | Updated on :3 October 2022,5:00 pm

Goat leg curry : ఈ చలికాలంలో చాలామందికి జలుబులు, దగ్గు, లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి జలుబులు డబ్బులు తగ్గడానికి మేక కాళ్ళ పులుసు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే జలుబు ఇక పారిపోవాల్సిందే…ఈ మేక కాళ్ల కూరకి కావాల్సిన పదార్థాలు:మేక కాళ్లు, పసుపు, కారం, ఉప్పు , గరం మసాల ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కాయలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు, గసగసాలు ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొత్తిమీర, చింతపండు రసం, మొదలైనవి..

దీని తయారీ విధానం: ముందుగా మేక కాలనీ తీసుకొని శుభ్రం చేసుకొని ఒక కుక్కర్లో వాటిని వేసి దాంట్లో రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రెండు స్పూన్ల అల్లం పేస్ట్, రెండు గ్లాసుల ఆయిల్ పోసి నాలుగు కప్పుల నీటిని వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. తర్వాత గసగసాలు ఒక నాలుగు స్పూన్లు తీసుకుని వాటిని వేయించుకొని ఒక కొబ్బరి ముక్కను కాల్చి దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని గసగసాలు కొబ్బరి రెండిటిని మిక్సీ జార్లో వేసి వాటర్ పోసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను స్టౌ పై పెట్టి దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దాన్లో ఒక కప్పు ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి.

If you eat goat's leg curry, you will get rid of colds

If you eat goat’s leg curry, you will get rid of colds

దాంట్లో తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ,కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా ఉడకబెట్టిన కాళ్లలో ఉన్న నీటిని దీంట్లో వేసుకోవాలి. ఇక తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి మసలు కాగనివ్వాలి. తర్వాత ఆ కాళ్ళను కూడా అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి దంచి ఈ కొడుకుతున్న కూరలో వేయాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుతూ మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక తర్వాత మూత తీసి పులుసు దగ్గరికి అయిన తర్వాత దానిలో కొత్తిమీర వేసి దింపి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా మేక కాళ్ళ కూర రెడీ.

Also read

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది