Credit Cards : ఇలా క్రెడిట్ కార్డ్స్ తో షాపింగ్ చేస్తే మీకు ఫుల్ గా డబ్బులు సేవ్ అవుతాయి..!!
Credit Card Using : పండుగల సందర్భంగా, లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్స్‌లో చాలా మంది షాపింగ్ చేస్తుంటారు. డిజిటల్ చెల్లింపులు పెరిగిపోవడంతో చాలామంది క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఎస్‌బీఐ, యాక్సిస్ వంటి కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి కొన్ని కార్డుల ద్వారా షాపింగ్ చేస్తే వోచర్లు, ఫ్లైట్ టిక్కెట్లపై తగ్గింపులు పొందవచ్చు.

Credit Cards
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులైన అమెజాన్ పే ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుల ద్వారా భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. షాపింగ్‌పై కొన్ని సందర్భాల్లో 10 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు కేవలం సేల్ ధర చూడటమే కాకుండా, ప్లాట్‌ఫామ్ కూపన్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, పార్ట్‌నర్ బ్యాంక్ డిస్కౌంట్లు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అలాగే, “నో కాస్ట్ ఈఎమ్ఐ” వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలి. వీటిలో కొన్ని దాగి ఉన్న ఖర్చులు (హిడెన్ కాస్ట్స్), ప్రాసెసింగ్ ఫీజులు అధికంగా ఉండే అవకాశం ఉంది.
మనం క్రెడిట్ కార్డు ద్వారా సంపాదించిన రివార్డు పాయింట్లను సమయం చూసి రిడీమ్ చేసుకోవాలి. వీటిని గిఫ్ట్ కార్డుల రూపంలో వాడవచ్చు లేదా కొన్ని ప్రీమియం సేవలను పొందవచ్చు. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, అమెజాన్‌లో షాపింగ్ చేయడానికి అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డును, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌కు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డును ఉపయోగించవచ్చు. “లిమిటెడ్ పీరియడ్ ఆఫర్”గా వచ్చే ఫ్లాష్ సేల్స్ సమయంలో ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ క్రెడిట్, డెబిట్ కార్డు షాపింగ్‌ను మరింత తెలివిగా, ఆర్థికంగా లాభదాయకంగా మార్చుకోవచ్చు.