Home » Exclusive » In This Company Employees Get 1 Crore Salary
Exclusive

1 Crore Salary : ఈ కంపెనీ ఓన‌ర్ నిజంగా దేవుడు.. ఉద్యోగులకు కోటికి పైగా జీతం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 30, 2024, 5:00 pm
Advertisement

1 Crore Salary : టొబాకో కంపెనీ లిమిటెడ్. ఈ పేరు మీరు వినే ఉంటారు. సిగరెట్ల నుంచి హోటల్స్ వరకు ఎన్నో కంపెనీల సమ్మేళనంగా ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పటికే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం 2023 -24 ఆర్థిక సంవత్సరంలో మరో 68 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరులను చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 24.14% పెరగడం విశేషం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సరికొత్త వార్షిక నివేదిక ద్వారా ఈ విషయాన్ని వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీలో 350 మంది కోటి రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో 282 గా ఉంది.

Advertisement

తాజాగా కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం ప్రస్తుత కంపెనీలో కోటి రూపాయల ప్యాకేజ్ ని అందుకుంటున్న వారి సగటు నెల జీతం దాదాపు 9 లక్షల పైగా ఉంటుందట. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎక్కువైంది. అదేవిధంగా ఐటీసీ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవి పూరి పారితోషికం ఏకంగా 80% కి పెరిగింది. ప్రస్తుతం ఆయన వేతనం రూ.28.62 కోట్లకు చేరింది. అలాగే మేనేజ్ మెంట్ పర్సనల్స్ వేతనాలు 59 శాతానికి పెరిగినట్లుగా కంపెనీ ప్రకటించడం జరిగింది. అయితే మరో కంపెనీ మొత్తం ఉద్యోగుల సగటు వేతనం తొమ్మిది శాతానికి పెరిగింది. ఇక 2024 మార్చి 31 వరకు చూసినట్లయితే ఈ సంవత్సరం మొత్తం ఉద్యోగుల సంఖ్య 24,567 గా ఉంది.

1 Crore Salary : ఈ కంపెనీ ఓన‌ర్ నిజంగా దేవుడు.. ఉద్యోగులకు కోటికి పైగా జీతం…!

Advertisement

అదేవిధంగా కంపెనీ ఈ ఏడాదిలో దీర్ఘకాలిక ప్రోత్సాహకాలని చెల్లించడం మరియు సహ మధ్యంతర కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి కారణం అని చెప్పింది. ఇక ఈ సంస్థకు సిగరెట్లు, హోటల్స్ FMCG, పేపర్ బోర్డ్స్ , అగ్రి బిజినెస్ లతోపాటు పేపర్ అండ్ ప్యాకేజింగ్ ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. అలాగే కంపెనీ యొక్క నికర ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రతిపాదన 0.42 శాతం పెరగగా రూ.76,840.49 కోట్లు నమోదు అయింది. ఇదే సమయంలో నికర లాభం 6.6 శాతం 20,458.78 కోట్లకు చేరడం జరిగింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి