Pawan Kalyan : ఈ సారి భీమవరం కాదు? జగన్ దెబ్బకి ఆ నియోజకవర్గం వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఈ సారి భీమవరం కాదు? జగన్ దెబ్బకి ఆ నియోజకవర్గం వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 October 2022,10:30 am

Pawan Kalyan : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గంలో ఏ నేతను దించాలో ప్లాన్లు వేస్తున్నారు. జనసేన పార్టీ కూడా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనేదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. ఈనేపథ్యంలో 2024 ఎన్నికల్లో మళ్లీ తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం పవన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

నిజానికి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ.. రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. అయినప్పటికీ మళ్లీ భీమవరం నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 లో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కళ్యాణ్ ఆశ నెరవేరలేదు. కానీ.. 2024 లో అయినా ఆయన ఆశ నెరవేరుతుందో వేచి చూడాలి. ముందు పార్టీ నేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే జనసేన వాణిని అసెంబ్లీలో వినిపించవచ్చని జనసేన నేతలు అంటున్నారు.

in which constituency pawan kalyan would contest as mla

in which constituency pawan kalyan would contest as mla

Pawan Kalyan : 2024 లో పవన్ కోరిక నెరవేరుతుందా?

పవన్ కళ్యాణ్ తో పాటు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా అసెంబ్లీలో జనసేన హడావుడి ఉంటుంది. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వం వహించే సినిమాలో పవన్ నటించనున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్నికల ర్యాలీలో పవన్ పాల్గొంటారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. దసరానాడు సినిమాను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ ఫస్ట్ వీక్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది