Income Tax Returns | ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు: పన్ను చెల్లింపుదారులకు CBDT శుభవార్త
Income Tax Returns | పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఊరట కల్పించింది. 2025–26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు (ITRs) దాఖలుకు గడువును సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది.ఈ మేరకు CBDT సోమవారం రాత్రి ఒక ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. రిటర్నులు దాఖలుచేయడానికి చివరి రోజైన సెప్టెంబర్ 15న పోర్టల్ పై విపరీతమైన ట్రాఫిక్ కారణంగా అనేక సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
#image_title
ఆలస్యం చేయకండి..
మొదట గడువు: జూలై 31 కాగా, ఆ తర్వాత పొడిగింపు: సెప్టెంబర్ 15కి పెంచారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 16 అని అన్నారు. సెప్టెంబర్ 15 నాటికి 7.3 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి.వీటిలో 4 కోట్లకు పైగా రిటర్నుల పరిశీలన పూర్తైనట్లు ఆదాయపన్ను విభాగం వెల్లడించింది.సెప్టెంబర్ 16 తరువాత కూడా ITRలు దాఖలు చేయొచ్చు. కానీ ఇది లేట్ ఫైలింగ్ గా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో Section 234F ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది:
వరుస ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే – రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువైతే – రూ. 5,000,
అలాగే Section 234A ప్రకారం చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1% వడ్డీ కూడా విధించబడుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు చివరి తేదీ.. ఆలస్య రుసుముతో 2025 డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది.