Apps Ban : మరో 54 యాప్ లు బ్యాన్ చేసిన భారత్..!
చైనాకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం… దేశ భద్రతకు ముప్పు తెచ్చే మరో 54 చైనీస్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. జూన్ 2020 నుండి, TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer వంటి యాప్స్ ని కేంద్రం బ్యాన్ చేసింది.
Mi కమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్‌లతో సహా దాదాపు 224 చైనీస్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. నిషేధించబడిన యాప్‌ల లిస్టు ఒకసారి చూస్తే… బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా – సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ & బాస్ బూస్టర్, క్యామ్‌కార్డ్ ఫర్ సేల్స్‌ఫోర్స్ ఎంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మియోజీ చెస్, ఆన్‌మియోక్ మరియు అరేనా డ్యూయల్ స్పేస్ లైట్ వంటి యాప్స్ ని బ్యాన్ చేసింది.
అయితే కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడం కాదని ఒకవేళ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మాత్రం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ యాప్‌లలో చాలా వరకు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారని కేంద్రం స్పష్టం చేసింది.