2022 Google Searchs : ఈ ఏడాది భారతీయులు గూగుల్లో ఎక్కువగా దీని కోసమే వెతికారట .. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు ..!
2022 Google Searchs : తాజాగా గూగుల్ లో భారతీయులు ఎక్కువగా వెతికిన పదాల లిస్టును గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2022 రిజల్ట్స్ పేరుతో ప్రకటించింది. అయితే మన ఇండియన్స్ ఎక్కువగా గూగుల్ లో క్రికెట్ కోసం వెతికారట. ఇక ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆవిష్కరించిన కోవిన్ యాప్ కోసం ఎక్కువగా సెర్చ్ చేసారట. ప్రస్తుతం ఖతర్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పదం టాప్ 5 సెర్చింగ్ లిస్టులో ఉంది. ఇక వీటితో పాటు కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, హౌ టు లింక్ ఓటర్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్, హౌ టూ మేక్ ఈ శ్రమ్ కార్డ్ వంటి వాటిని ఎక్కువగా వెతికారట.
భారతీయులు గూగుల్లో కామన్ వెల్త్ గేమ్స్, ఐపీఎల్ స్పోర్ట్స్ కోసం ఎక్కువగా వెతికారట. ఇక సినిమాల పరంగా అయితే బ్రహ్మస్త్ర, శివ పార్ట్ – 1, కేజిఎఫ్ – 2, e – SHRAM Card కోసం ఎక్కువగా వెతికారట. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం గురించి ఎక్కువగా వెతికేశారు. ఇక వాట్ ఇస్ క్యాటగిరి కింద నాటో, ఎన్‌ఎఫ్‌టీ, పీఎఫ్‌ఐ, సరోగసీ, సోలార్ ఎలిప్స్, ఆర్టికల్ 370 టాప్ లిస్టులో ఉన్నాయి. వీటితోపాటు దగ్గర్లో ఉన్న కోవిడ్ సెంటర్లు,
స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్స్, మాల్స్, థియేటర్స్ వంటి పదాలను ఎక్కువగా వెతికేసారట. అలాగే ప్రముఖుల వ్యక్తుల జాబితాలో ఎక్కువగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే కొత్త ప్రధాన రిషి సునాక్ అలాగే లెజెండరీ సింగర్ లలిత మంగేష్కర్ మృతి, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూపీ ఎన్నికల ఫలితాలు, దేశంలోని కోవిడ్-19 కేసులు, ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ మృతి, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II మృతి, సింగర్ బప్పి లహిరి మృతి వంటి వాటిని భారతీయులు ఎక్కువగా గూగుల్‌లో వెతికారట.