Onion Bonda Recipe : ఉల్లిపాయలతో బోండా సింపుల్ గా చేసుకోండి ఇలా…
Onion Bonda Recipe : అందరూ స్నాక్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. వర్షాకాలంలో అయితే వర్షం పడుతుండగా ఏదో ఒక స్నాక్ వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. అయితే ఈ ఉల్లిపాయలతో ఎన్నో రకాల స్నాక్స్ అయితే చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు కొత్తగా ఉల్లిపాయలతో బోండా చేయడం ఎలాగో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు: 1)ఉల్లిపాయలు2) కరివేపాకు3)శెనగపిండి4) బియ్యప్పిండి5) ఉప్పు 6)చాట్ మసాలా 7)పచ్చిమిర్చి8)అల్లం వెల్లుల్లి పేస్ట్9) పసుపు 10)కారం 11)జీలకర్ర పొడి 12)ధనియా పౌడర్13) నూనె 14)నీళ్లు మొదలగినవి..
తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని పావు కేజీ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, దానిలోకి సన్నగా తరిగిన కరివేపాకు, అర స్పూన్ కారం, అర స్పూన్ చాట్ మసాలా, ఉప్పు రుచికి తగినంత అర స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ జీలకర్ర పౌడర్, చిన్న కప్పు పచ్చిమిర్చి తరుగు, రెండు స్పూన్ల వేడి ఆయిల్ ఇవన్నీ వేసి 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద కప్పు శెనగపిండి, అర కప్పు బియ్యప్పిండి వేసి కొంచెం కొంచెంగా నీరు వేస్తూ కలుపుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని బోండల్ల చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పైన బాండి పెట్టి దానిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బొండాలను అందులో వేసి మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఉల్లిపాయలతో బోండా రెడీ. వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని దీనిపైన నిమ్మకాయ పిండి ఉల్లిపాయలతో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.