Intelligent Crow Real Story : ఇంటెలిజెంట్ కాకి.. కథ కాదు.. రియల్.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intelligent Crow Real Story : ఇంటెలిజెంట్ కాకి.. కథ కాదు.. రియల్.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి.. వీడియో

Intelligent Crow Real Story : కాకి కథ ఎంత మందికి తెలుసు చెప్పండి. చిన్నపిల్లలను అడిగినా చెబుతారు కాకి కథ. ఒక కుండలో ఉన్న నీళ్లు తాగుదామంటే ఆ నీళ్లు కాకికి అందవు. దీంతో తెలివిగా ఆలోచించి ఆ కాకి పక్కనే ఉన్న గులక రాళ్లను తీసుకొచ్చి కుండలో వేస్తుంది. దీంతో నీళ్లు కుండ మీదికి వస్తాయి. దీంతో ఆ కాకి ఏంచక్కా నీళ్లు తాగి తన దాహం తీర్చుకొని అక్కడి నుంచి తుర్రుమంటుంది. ఈ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :13 April 2023,9:00 pm

Intelligent Crow Real Story : కాకి కథ ఎంత మందికి తెలుసు చెప్పండి. చిన్నపిల్లలను అడిగినా చెబుతారు కాకి కథ. ఒక కుండలో ఉన్న నీళ్లు తాగుదామంటే ఆ నీళ్లు కాకికి అందవు. దీంతో తెలివిగా ఆలోచించి ఆ కాకి పక్కనే ఉన్న గులక రాళ్లను తీసుకొచ్చి కుండలో వేస్తుంది. దీంతో నీళ్లు కుండ మీదికి వస్తాయి. దీంతో ఆ కాకి ఏంచక్కా నీళ్లు తాగి తన దాహం తీర్చుకొని అక్కడి నుంచి తుర్రుమంటుంది. ఈ కథ ఎంతమందికి తెలియదు. అందరికీ తెలుసు.

Crows and Ravens | Celebrate Urban Birds

కానీ.. ఇది కథ అని తెలుసు. ఇది నిజం కాదు అని తెలుసు. పిల్లలు అప్పటి పరిస్థితులను బట్టి ఎలా తెలివిగా ఉండాలో చెప్పే కథ ఇది.కానీ.. ఇప్పుడు ఆ కథే నిజం అయింది. ఒక కాకి నిజంగానే నీళ్లు తాగేందుకు కథ జరిగినట్టే చేసింది. ఒక ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న నీళ్లను తాగేందుకు కాకి తెగ ప్రయత్నాలు చేసింది. కానీ.. ఆ నీళ్లు తాగేందుకు ఆ కాకికి అస్సలు కుదరలేదు. దీంతో ఆ కాకి ఆ కథను విన్నదో ఏమో కానీ.. కథలో జరిగినట్టుగానే చేసింది.

Intelligent Crow Real Story

Intelligent Crow Real Story

Intelligent Crow Real Story : బాటిల్ లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి

ప్లాస్టిక్ బాటిల్ లోని నీళ్లు తనకు తాగడానికి రాకపోవడంతో వెంటనే పక్కనే ఉన్న రాళ్లను తీసుకొని ఆ బాటిల్ లో వేసింది. దీంతో ఆ బాటిల్ లో ఉన్న నీళ్లు పైకి వచ్చాయి. దీంతో హమ్మయ్య అనుకొని వెంటనే దప్పిక తీర్చుకుంది ఆ కాకి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కొంపదీసి ఆ కాకి.. కాకి కథను ఎక్కడైనా చదివిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది