Chandrababu – Akhila Priya : అఖిలప్రియ విషయంలో చంద్రబాబు షాకింగ్ నిర్ణయం.. పొమ్మనలేక పొగ పెడుతున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu – Akhila Priya : అఖిలప్రియ విషయంలో చంద్రబాబు షాకింగ్ నిర్ణయం.. పొమ్మనలేక పొగ పెడుతున్నారా?

 Authored By kranthi | The Telugu News | Updated on :22 November 2022,11:00 am

Chandrababu – Akhila Priya : కర్నూలు జిల్లా అంటేనే భూమా ఫ్యామిలీకి పెట్టింది పేరు. అక్కడ రాజకీయాలు చేయాలంటే వాళ్ల తర్వాతనే ఎవరైనా. చాలా ఏళ్ల నుంచి అక్కడ భూమా ఫ్యామిలీ రాజ్యమేలుతోంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఇప్పటికీ వాళ్లే సత్తా చాటుతున్నారు. కాకపోతే.. ప్రస్తుతం భూమా ఫ్యామిలీ వారసులు రాజకీయాల్లో వచ్చారు. దానికి కారణం.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు.

కట్ చేస్తే 2024 లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి.. ఈసారి అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డికి టికెట్లు దక్కుతాయా? అనేది డౌట్ గా ఉంది. ఎందుకంటే.. ఇటీవల కర్నూలు జిల్లాకు వెళ్లిన చంద్రబాబు.. అఖిలప్రియ విషయంలో క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. బాబు పర్యటనలో అఖిలప్రియ మాత్రం కనిపించలేదు. బ్రహ్మానందరెడ్డి.. బాబు పర్యటనలో కనిపించారు కానీ.. అఖిలప్రియ ఎక్కడా కనిపించలేదు. నిజానికి.. బాబును కలవడానికి వస్తే.. ఆమెను చంద్రబాబు కలవలేదట.

is chandrababu neglecting Akhila Priya

is chandrababu neglecting Akhila Priya

Chandrababu – Akhila Priya : అఖిలప్రియ తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా?

కావాలనే అవాయిడ్ చేస్తున్నారట. కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ల సమావేశంలోనూ అఖిల ప్రియ హాజరు కాలేదట. మేము టికెట్ అడగం.. మేమే పది మందికి టికెట్ ఇస్తాం.. అది మా స్థాయి అంటూ అఖిలప్రియ ఆ మధ్య మాట్లాడినట్టు సమాచారం. దానిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ ఆళ్లగడ్డలో మళ్లీ అఖిలప్రియను నిలబెడితే ఓడిపోయే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయట. దీంతో చంద్రబాబు అఖిలప్రియను పక్కన పెట్టారని తెలుస్తోంది. చూద్దాం మరి.. అఖిలప్రియకు ఒకవేళ టికెట్ దక్కదని తెలిస్తే పార్టీ మారుతారా? అనేది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది