Ys Jagan : బీజేపీ పై వైఎస్ జగన్ యుద్ధం ప్రకటించినట్లేనా.?
Ys Jaganఅంశాల వారీగా కేంద్రానికి వైసీపీ ఎంపీలు మద్దతిస్తున్నారు.. అదీ చట్ట సభల్లో. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు బలంగా వుంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న కోణంలో, మోడీ సర్కారుకి వైసీపీ సహకరిస్తోంది. కొత్త సాగు చట్టాలు కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు, వైసీపీ సహకారాన్ని మోడీ సర్కారు కోరుతోంది. ఓ బాధ్యతగల ముఖ్యమంత్రిగా, ఓ బాధ్యతగల పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రం తరఫున, పార్టీ తరఫున అవసరమైన ప్రతిసారీ, కేంద్రానికి తగు […]
Ys Jaganఅంశాల వారీగా కేంద్రానికి వైసీపీ ఎంపీలు మద్దతిస్తున్నారు.. అదీ చట్ట సభల్లో. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు బలంగా వుంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న కోణంలో, మోడీ సర్కారుకి వైసీపీ సహకరిస్తోంది. కొత్త సాగు చట్టాలు కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు, వైసీపీ సహకారాన్ని మోడీ సర్కారు కోరుతోంది. ఓ బాధ్యతగల ముఖ్యమంత్రిగా, ఓ బాధ్యతగల పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రం తరఫున, పార్టీ తరఫున అవసరమైన ప్రతిసారీ, కేంద్రానికి తగు రీతిలో మద్దతిస్తూ వస్తున్నారు.
మరి, దీనికి ప్రతిఫలంగా బీజేపీ కావొచ్చు, కేంద్రం కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వైసీపీ సర్కారుకి ఏం ఉపయోగపడుతున్నట్లు.? మూడేళ్ళపాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా సాయపడ్డారు. బీజేపీకి, వైసీపీ అన్నివిధాలుగా సహకరించింది. కానీ, రాష్ట్రానికి ఈ సఖ్యత వల్ల వీసమెత్తు ప్రయోజనం కూడా లేకుండాపోయిందన్న విమర్శలున్నాయి.
ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా, పోలవరం ప్రాజెక్టుకైనా పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడంలేదు. రైల్వే జోన్ ప్రకటించినా, ఆ పనులూ ముందుకు కదలడంలేదు. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, కేంద్రం.. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ సానుకూలంగా స్పందించడం లేదు.
Is Ys Jagan Kickstarted War Against BJPఇలా అన్నిటికీ ‘నో’ చెబుతున్న కేంద్రానికీ, బీజేపీకీ ఎందుకు పరోక్ష మద్దతునైనా కొనసాగించాలి.? అన్న నిర్ణయానికి వచ్చిన వైఎస్ జగన్, పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల్ని పరామర్శించే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో యుద్ధం చేస్తున్నామనీ ప్రకటించారు. పోలవరం నిర్వాసితులు తిడుతున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళతానని కూడా వైఎస్ జగన్ చెప్పడం గమనించాల్సిన విషయం. ముంపు పరిహారాన్ని కేంద్రమే నేరుగా బటన్ నొక్కి లబ్దిదారులకు పంపించాలని కూడా వైఎస్ జగన్ సూచించారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అస్త్ర శస్త్రాలు సిద్ధమవుతున్నాయి.. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించే అంశం కూడా వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారేమో.!