
is ys jagan-waiting for daggubati venkateswar rao decision
YS Jagan : సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అయితే అస్సలు ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. దీంతో ఏపీలోని ముఖ్యమైన నేతలను అందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. తాజాగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే కాదు..
తన కొడుకు హితేష్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు దగ్గుబాటి.తాజాగా బాపట్లలోని పర్చూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాము మనలేమని చెప్పారు. అందుకే మనసు చంపుకొని నేటి రాజకీయాలను తాను చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అందుకే.. తనతో పాటు తన కొడుకు హితేష్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కాకపోతే.. తన భార్య పురందీశ్వరి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
is ys jagan-waiting for daggubati venkateswar rao decision
2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి చేతుల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి, రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. అయితే.. తను రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకు హితేశ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.. బీజేపీలో తన భార్య ఉండటం వల్ల.. మళ్లీ వేరే పార్టీలో చేరడం సరికాదు అనుకున్నారో ఏమో.. అందుకే తన కొడుకుతో పాటు ఆయన కూడా రాజకీయాలకు స్వస్తి పలికారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.