YS Jagan : సంక్రాంతి అయిపోయింది – దగ్గుబాటి సంచలన నిర్ణయం కోసం జగన్ సిద్ధమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : సంక్రాంతి అయిపోయింది – దగ్గుబాటి సంచలన నిర్ణయం కోసం జగన్ సిద్ధమా?

YS Jagan : సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అయితే అస్సలు ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. దీంతో ఏపీలోని ముఖ్యమైన నేతలను అందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. తాజాగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే కాదు.. తన కొడుకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 January 2023,3:00 pm

YS Jagan : సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అయితే అస్సలు ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. దీంతో ఏపీలోని ముఖ్యమైన నేతలను అందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. తాజాగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే కాదు..

తన కొడుకు హితేష్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు దగ్గుబాటి.తాజాగా బాపట్లలోని పర్చూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాము మనలేమని చెప్పారు. అందుకే మనసు చంపుకొని నేటి రాజకీయాలను తాను చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అందుకే.. తనతో పాటు తన కొడుకు హితేష్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కాకపోతే.. తన భార్య పురందీశ్వరి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.

is ys jagan waiting for daggubati venkateswar rao decision

is ys jagan-waiting for daggubati venkateswar rao decision

YS Jagan : వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి

2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి చేతుల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి, రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. అయితే.. తను రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకు హితేశ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.. బీజేపీలో తన భార్య ఉండటం వల్ల.. మళ్లీ వేరే పార్టీలో చేరడం సరికాదు అనుకున్నారో ఏమో.. అందుకే తన కొడుకుతో పాటు ఆయన కూడా రాజకీయాలకు స్వస్తి పలికారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది