ఒకరు కాదు ఇద్దరు కాదు – 20 మంది టీడీపీ నేతలకి మడతెట్టేసిన జగన్ సర్కార్
నో డౌట్. టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని, వైసీపీ నేతలను అధికారంలో టీడీపీ ఇబ్బందులు పెట్టడంతో.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని ఇబ్బందులు పెడుతోంది. ఇది ఎక్కడైనా కామన్. ప్రస్తుతం టీడీపీ నేతలపై ఏపీలో ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. దీంతో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. టీడీపీని, పార్టీ నేతలను అధికార పార్టీ అధికారంలోకి రాగానే టార్గెట్ చేసింది.
తాజాగా టీడీపీ ఎమ్మెల్సీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవిని చెన్నై వెళ్లి మరీ కడప పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
నారా లోకేశ్ ఫైర్
తన సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కల్పించలేదు కానీ.. టీడీపీ నాయకులపై మాత్రం అట్రాసిటి కేసులు నమోదు చేస్తారా? వాళ్లపై కేసులు నమోదు చేసి వికృతానందం పొందుతున్నారు జగన్ రెడ్డి. దళిత మహిళ నాగమ్మ కుటుంబానికి ముందు న్యాయం చేయండి.. అంటూ సీఎం జగన్ ను టీడీపీ లీడర్ నారా లోకేశ్ ప్రశ్నించారు.
మహిళలకు న్యాయం చేయండి బాబు.. అంటూ పులివెందులకు టీడీపీ నేతలు వెళ్తే.. అక్కడ వాళ్లను ఎస్సీ, ఎస్టీ కేసు కింద బుక్ చేసి అక్రమ కేసులు బనాయించడం ఏంది. రాష్ట్రంలో ఏ సర్కారు ఉంది. ఎస్సీ, ఎస్టీ కేసును ఇలా దుర్వినియోగం చేసే హక్కు జగన్ కు ఎవరిచ్చారు.. అంటూ లోకేశ్ మండిపడ్డారు.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా చలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొనందుకు పోలీస్ అరెస్ట్ చేశారు. మహిళల హక్కులను కాపాడండి.. అని అడిగినందుకు అక్రమంగా కేసులు పెడుతారా? అంటూ నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.