Blower Electric Chulha : వామ్మో అచ్చం మనం వాడే గ్యాస్ స్టవ్‌లా ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ .. ధర కూడా చాలా తక్కువ..!

 Authored By suma | The Telugu News | Updated on :14 March 2026,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Blower Electric Chulha : వామ్మో అచ్చం మనం వాడే గ్యాస్ స్టవ్‌లా ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ .. ధర కూడా చాలా తక్కువ..!

Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి అది సాధారణ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లానే కనిపిస్తుంది. నాబ్ తిప్పగానే నీలి రంగు మంటలు వెలువడుతాయి. చూసినవారు ఇది గ్యాస్ స్టవ్ అనుకోవడం సహజం. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే… దీనికి గ్యాస్ సిలిండర్ అవసరం ఉండదు. ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేకుండానే ఇది పనిచేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ ప్లగ్‌కు కనెక్ట్ చేస్తే చాలు మంటలు వస్తాయని వీడియోల్లో చూపిస్తున్నారు. ఈ కొత్త పరికరాన్ని “ఎలక్ట్రిక్ బ్లోయర్ చుల్హా” లేదా “జామీ ఎలక్ట్రిక్ స్టవ్” అని పిలుస్తున్నారు. గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో ఇది మధ్యతరగతి కుటుంబాలకు మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొందరు దీన్ని భవిష్యత్తు వంటగది టెక్నాలజీగా కూడా పేర్కొంటున్నారు.

Blower Electric Chulha : వామ్మో అచ్చం మనం వాడే గ్యాస్ స్టవ్‌లా ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ .. ధర కూడా చాలా తక్కువ..!

Blower Electric Chulha : వామ్మో అచ్చం మనం వాడే గ్యాస్ స్టవ్‌లా ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ .. ధర కూడా చాలా తక్కువ..!

Blower Electric Chulha : ఇది ఎలా పనిచేస్తుంది?

చాలామంది ఈ పరికరాన్ని ఇండక్షన్ స్టవ్‌లాగే అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా వేరే విధంగా పనిచేస్తుంది. ఈ స్టవ్ లోపల ఒక శక్తివంతమైన హీటింగ్ కాయిల్ అమర్చబడుతుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే ఆ కాయిల్ వేడెక్కి ఎర్రగా మారుతుంది. అదే సమయంలో ఇందులో అమర్చిన చిన్న బ్లోయర్ ఫ్యాన్ ఆ వేడిని పైభాగం వైపు నెడుతుంది. ఈ వేడి గాలి ప్రవాహం బయటకు వస్తున్నప్పుడు మనకు నీలి రంగు మంటలాగా కనిపిస్తుంది. చూడటానికి ఇది గ్యాస్ మంటలా కనిపించినా, ఇందులో గ్యాస్ దహనం జరగదు. అందువల్ల పొగలు లేదా హానికరమైన వాయువులు విడుదల కావు. ఈ విధంగా విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ స్టవ్ సాధారణ గ్యాస్ స్టవ్ అనుభూతిని ఇవ్వగలదని ప్రచారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఈ పరికరం గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Blower Electric Chulha : వంటకు ఎంతవరకు ఉపయోగకరం?

సాధారణంగా ఇండక్షన్ స్టవ్‌లపై ప్రత్యేకమైన గిన్నెలే వాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ బ్లోయర్ స్టవ్‌పై మాత్రం గ్యాస్ స్టవ్‌లపై వాడే గిన్నెలన్నీ వాడుకోవచ్చని చెప్పుతున్నారు. చపాతీలు కాల్చడం, ఫ్రైలు చేయడం, కూరలు వండడం వంటి పనులు కూడా సులభంగా చేయవచ్చని వీడియోల్లో చూపిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్యాస్ సిలిండర్ అయిపోతుందన్న భయం ఉండదు. గ్యాస్ లీకేజీ ప్రమాదం కూడా ఉండదని అంటున్నారు. అలాగే వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, హాస్టల్‌లో ఉండే వారు లేదా చిన్న కుటుంబాలకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం కావొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టవ్‌లు ఎక్కువగా సోషల్ మీడియా వీడియోల్లో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని లోకల్ గ్యాడ్జెట్ షాపుల్లో కూడా లభిస్తున్నాయని సమాచారం. వీటి ధర సుమారు రూ.3,000 నుంచి ప్రారంభమై క్వాలిటీని బట్టి రూ.15,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Blower Electric Chulha : కొనుగోలు ముందు జాగ్రత్తలు తప్పనిసరి

అయితే ఈ స్టవ్‌ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అన్ని నిజం కావాల్సిన అవసరం లేదు. కొందరు ఫేక్ లింక్స్ ఇచ్చి వినియోగదారులను మోసం చేసే అవకాశమూ ఉంది. అందువల్ల ఎక్కడైనా లింక్ చూసి వెంటనే డబ్బులు చెల్లించడం మంచిది కాదు. ముందుగా ప్రొడక్ట్ వివరాలు తెలుసుకోవాలి. కనీసం ఆరు నెలల వారంటీ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. వీలైతే ప్రత్యక్షంగా షాప్‌లో చూసి కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బ్లోయర్ చుల్హా భవిష్యత్తులో ఎంతవరకు ప్రజాదరణ పొందుతుందో చూడాలి. అయితే కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

Also read

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి