Janaki Kalaganaledu 19 Aug Today Episode : జానకి కలగనలేదు 19 ఆగస్టు 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 109 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బావగారు మీ గీత దాటరని.. మీరు చాలా బలంగా నమ్ముతారు. మీ మాటే వేదవాక్కు అని అనుకున్నా. కానీ.. తన భార్య కోసం అమ్మ నమ్మకాన్ని మోసం చేయడానికి బావ గారికి ఎలా మనసు వచ్చిందో అర్థం కావడం లేదు. అయినా.. ఇన్ని సంవత్సరాలు పెంచిన అమ్మ కంటే.. నిన్న కాక మొన్న వచ్చిన భార్యే ఎక్కువైపోయింది భార్య గారికి. ఏం చేస్తాం.. అంటూ మల్లిక.. జ్ఞానాంబకు అన్నీ నూరిపోస్తుంది. అమ్మ మనసు బాధపడుతుంది అని కూడా బావ గారు ఆలోచించలేదా? అంటూ జ్ఞానాంబకు చెబుతూ.. మన ప్లాన్ వర్కవుట్ అవుతోందంటూ మల్లిక తెగ సంతోషపడిపోతుంది.
ఇంతలో.. బైక్ మీద రామా, జానకి.. ఇద్దరూ వస్తుంటారు. బాగా ఇద్దరినీ ఇరికించాను.. అని సంతోషపడుతుంటుంది. ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అండి. మీకు చాలా థ్యాంక్స్.. అంటూ ఖార్ఖానాకు వెళ్లి ఖార్ఖానా తలుపులు తీస్తారు ఇద్దరూ. ఇంతలోనే జ్ఞానాంబ అక్కడ నిలబడి ఉంటుంది. రామా, జానకి.. ఇద్దరూ జ్ఞానాంబకు చూసి షాక్ అవుతారు.
అమ్మ.. అసలు.. అని రామా అనగానే.. ఎక్కడికి వెళ్లారు మీరు.. అని అడుగుతుంది జ్ఞానాంబ. అంటే అమ్మ అది.. అని ఏదేదో రామా చెప్పబోతుండగా.. అడిగిన దానికే సమాధానం చెప్పు. జానకి, నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నారు.. అంటూ అడుతుగుతుంది జ్ఞానాంబ. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు.. అని అడుగుతుంది. దీంతో సిటీకి వెళ్లాం అమ్మా అని చెబుతాడు.
అమ్మా.. అది.. జరిగింది ఏంటంటే.. నువ్వు చెప్పడం అయిపోయింది. ఇక నేను చెప్పడమే మిగిలి ఉంది. ఉదయాన్నే మీరు ఇంటికి రండి. నా నిర్ణయం ఏంటో మీకే తెలుస్తుంది.. అని జ్ఞానాంబ చెబుతుంది. అమ్మా.. అని రామా చెప్పినా కూడా చెప్పాను కదరా.. నువ్వు చెప్పేది అయిపోయింది. నేను చెప్పేదే ఉంది. పొద్దున్నే ఇంటికి రండి. అన్నింటికీ సిద్ధం కండి.. అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మల్లిక కూడా తనతో పాటే వెళ్లిపోతుంది.
ఖార్ఖానాలో రాత్రి ఇద్దరూ కూర్చొని తెగ బాధపడుతుంటారు. ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. జానకి చదువు విషయం.. జ్ఞానాంబకు తెలుస్తుందేమోనని తెగ భయపడుతుంటారు. అసలు.. ఏం చేయాలో కూడా వాళ్లకు అర్థం కాదు. అడుగడుగునా భయపడుతూనే ఉన్నాం. ఆ భయమే ఇప్పుడు నిజమైంది. చిన్న విషయానికే అత్తయ్య గారు నన్ను ఖార్ఖానాకు పంపించారు. తన మాట దాటి ప్రవర్తించామని.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చాలా భయంగా ఉంది. అసలు వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాం.. అని జానకి అంటుంది.
తప్పు చేయలేదండి.. మీరు కష్టపడి చదువుకున్నందుకు.. దానికి గుర్తింపు వస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. నా భార్య తర్వాత పట్టా తీసుకోలేదని బాధపడటం నేను చూడలేను.. అని రామా అనగానే.. మీరు చెప్పేది కరెక్టే కానీ.. నా వల్ల.. మీరు అత్తయ్య దగ్గర మాట పడాల్సి వస్తోంది. నా వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం ఇష్టం లేదు.. అని జానకి అంటుంది. మల్లిక చెప్పదు అని నేను అనుకున్నా కానీ.. మల్లిక ఇలా చేస్తుందని అనుకోలేదు.. అని రామా అంటాడు.
కట్ చేస్తే తెల్లారుతుంది. జానకి, రామా.. ఇద్దరూ ఇంటికి వస్తారు. అక్కడ రెండు సూట్ కేసులు ఉంటాయి. జ్ఞానాంబ కూర్చొని ఉంటుంది. అయ్యబాబోయ్.. జానకి పుట్టింటికి దారేది.. అనే సినిమా ఇక మొదలవబోతోంది.. అంటూ మల్లిక సంబురపడుతుంది.
అమ్మా జానకి మీరు లోపలికి వెళ్లండి.. అని అంటాడు జ్ఞానాంబ భర్త. అలా చూస్తారేంట్రా.. చెబుతుంటే అర్థం కావడం లేదా? లోపలికి వెళ్లండి.. అని ఆయన అనగానే.. ఎక్కడికి వెళ్లేది.. అని జ్ఞానాంబ ప్రశ్నిస్తుంది. ఆగండి… అని కుర్చీలో కూర్చున్న జ్ఞానాంబ పైకి లేచి.. నిలబడి.. నా నిర్ణయం చెప్పడం మాత్రమే మిగిలి ఉంది. నానిర్ణయం ఏంటో.. సూట్ కేసులను చూసి ఈపాటికే అర్థం అయి ఉంటుంది అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో చిన్న విషయానికే.. అని తన భర్త అంటారు. ఏంటి చిన్న విషయం.. అమ్మ మాటంటే వాడికి లెక్కలేదా? అమ్మ కంటే పెళ్లామే ఎక్కువా? అమ్మ మాటను లెక్క చేయకపోవడం చిన్నవిషయమా? అంటూ ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
దీంతో.. అమ్మా.. ఈలోకంలో అమ్మ మాటే నాకు శాసనం. అమ్మ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అమ్మ తర్వాతే నాకు ఎవ్వరైనా.. అని రామా చెప్తాడు. దీంతో… అవును.. నేను కూడా ఇన్ని రోజులు అదే అనుకున్నా. కానీ.. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. నువ్వు కూడా అందరి లాంటి కొడుకువేనని నిరూపించావు. నీ భార్య కోసం అమ్మ నమ్మకాన్ని వమ్ము చేశావు. నన్ను పిచ్చిదాన్ని చేశావు.. అని జ్ఞానాంబ అంటుంది.
లేదమ్మా.. ఒక కొడుకుగా మా అమ్మ గౌరవాన్ని నిలబెడతాను తప్పితే.. ఆమె గౌరవాన్ని ఏనాటికీ తగ్గించను.. అని చెబుతాడు రామా. జానకి ఖార్ఖానాలో ఉన్నన్ని రోజులు నువ్వు ఆమెను కలవడానికి కానీ.. ఖార్ఖానాకు వెళ్లడం కానీ చేయకూడదని చెప్పాను కదా. కానీ.. నీ భార్యను తీసుకొని నువ్వు ఏకంగా బయటికే వెళ్లావు.. ఈ అమ్మ మాటకు విలువ ఎక్కడుంది.. అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
ఇంతలో మల్లిక కలగజేసుకొని.. బావ గారు.. ఈరోజే కాదు.. నిన్న కూడా జానకిని చూడటం కోసం వచ్చారు. మీకు ఫోన్ చేసినా మామయ్య గారు ఫోన్ ఎత్తి… కట్ చేశారు. అనగానే.. మల్లిక నువ్వు మధ్యలో దూరి.. పుల్లలు పెట్టకు.. అని అంటాడు. నేను ఉన్న విషయాన్ని, జరిగిన విషయాన్నే కదా చెబుతున్నాను.. అంటుంది మల్లిక.
తన భర్త కూడా మల్లికను తిట్టడంతో.. అక్కడే కూర్చొని ఏడుస్తుంది మల్లిక. మీ అన్నయ్య గారిని చూడండి.. మీ అమ్మగారి మాటను లెక్క చేయకుండా.. తన భార్యను బయటికి తీసుకెళ్లాడు. కానీ.. మీరు మాత్రం నన్నే తిడుతున్నారు.. అందరూ నాకు శిక్షలు వేసేవాళ్లే.. అంటూ మల్లిక నాటకాలు ఆడుతుంది.
అత్తయ్య గారు అందరినీ ఒకేలాగా చూడాలి. తప్పు చేస్తే ఎవ్వరినైనా శిక్షించాలి. అంతే కానీ.. చిన్న కోడలును ఒకలాగా.. పెద్ద కోడలును ఒకలాగా చూస్తే.. అత్తయ్య గారి పెద్దరికానికి ఏం విలువ ఉంటుంది.. అంటూ ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తుంది మల్లిక.
విన్నావుగా. తను నా పెద్దరికాన్ని ప్రశ్నిస్తోంది. నేను మీ విషయంలో ఒకలాగా.. తన విషయంలో ఒకలాగా పక్షపాతం చూపిస్తున్నాని వేలెత్తి చూపిస్తోంది. తన ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పను. మల్లిక తెలియక కాదు.. చాలా తెలివిగా మాట్లాడింది. మీ పెద్దకొడుకు కోడలు.. నీ నిర్ణయాన్ని దాటి ప్రవర్తించారు కదా.
వాళ్లకు ఏం శిక్ష వేస్తావు అని ప్రశ్నించింది. తన నోరు మూయించాలంటే.. మీరు చేసిన తప్పుకు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. చెప్పు.. మరోసారి ఈ ఇంట్లో మల్లికలా ఇంకెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. నేనే చేయాలి. ఏం నిర్ణయం తీసుకోవాలో చెప్పు.. అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
అమ్మ.. నీ నిర్ణయం దాటి ప్రవర్తించడం తప్పు అమ్మా. నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మా.. అని రామా చెబుతాడు. నువ్వు, జానకి.. ఈ ఇంట్లోంచి వెళ్లిపోండి.. అని చెప్పేస్తుంది జ్ఞానాంబ. ఇదే మీకు నేను వేసే శిక్ష అని చెబుతుంది.
నువ్వు జానకిని తీసుకొని పట్నంలోని కాలేజీకి వెళ్లావా? లేదా? అని అడుగుతుంది జ్ఞానాంబ. తీసుకెళ్లాను అని చెబుతాడు రామా. అంటే.. జానకి చదివింది ఐదో తరగతి వరకే కాదా? అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో శుక్రవారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.