Janaki Kalaganaledu 6 Aug Today Episode : జానకి అబద్ధం చెప్పిందని.. పెద్ద శిక్ష వేసిన జ్ఞానాంబ.. ఆ శిక్షకు జానకి తలవంచుతుందా?

Janaki Kalaganaledu 6 Aug Today Episode : స్టార్ మా చానెల్ లో వస్తున్న జానకి కలగనలేదు సీరియల్ 100వ ఎపిసోడ్ 6 ఆగస్టు 2021 ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో జానకికి కఠిన పరీక్షలు పెడుతుంది జ్ఞానాంబ. ఖార్ఖానాలోనే మూడు రోజులు ఉండి.. స్వీట్ షాపులో పిండి వంటలు తయారు చేయడం నేర్చుకోవాలని జానకికి చెబుతుంది జ్ఞానాంబ. స్వీట్ షాపులో అంత కష్టపడి కట్టెల పొయ్యి ముందు నిలబడి చేయడం అంత ఈజీ కాదు కదా అని జ్ఞానాంబ భర్త అంటాడు. మనం అలాగే చేశాం కదా. అలా కష్టపడి పనిచేసే ఈ స్థాయికి వచ్చాం. మూడు రోజులు నువ్వు రామాను కలవకూడదు. ఖార్ఖానాలోనే ఉండాలి.. అని జానకికి చెప్పి జ్ఞానాంబ వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 6 aug 2021 episode 100 highlights

వెళ్లే ముందు.. నాకు మీరు ఇద్దరూ ఒక్కటే. రామా వేరు కాదు.. జానకి వేరు కాదు. ఇద్దరు తప్పు చేస్తే అమ్మలా శిక్షిస్తాను. అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక.. జానకి తోటి కోడలు హమ్మయ్య మంచిదైంది.. అని లోపల అనుకొని బయట మాత్రం ఏడుస్తున్నట్టు నటిస్తుంది. తన అత్తయ్య అలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాదు జానకికి.

జానకికి అలా చెప్పడం కరెక్ట్ కాదు.. అని తన భర్త జ్ఞానాంబను అడుగుతాడు. నేను చెప్పులు కుట్టించుకురాలేదని జానకిని అంతలా శిక్షించడం లేదు.. కేవలం జానకి అబద్ధం చెప్పిందని. అలాగే.. మల్లిక ఈ విషయంలో ఏం మాట్లాడకూడదని అందుకే జానకికి ఆ శిక్ష వేశాను.. అంటుంది. అది కరెక్ట్ కాదు జ్ఞానాంబ. మల్లిక గురించి తెలిసిందే కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు. మూడు రోజుల పాటు జానకిని ఖార్ఖానాలో శిక్షించడం అస్సలు కరెక్ట్ కాదు.. అని అంటాడు. ఇంతలో రామాకు ఫోన్ చేయ్ అని చెబుతుంది జ్ఞానాంబ. రామాకు ఫోన్ చేసి.. రామాను అడుగుతుంది. జానకి చెప్పు కుట్టించుకురమ్మని చెబితే.. కుట్టించుకొని రాలేదు. నాకు అబద్ధం చెప్పింది. అందుకే తనను మూడు రోజులు ఖార్ఖానాలోనే ఉండాలని చెప్పా.. అని రామాకు చెబుతుంది.

janaki kalaganaledu 6 aug 2021 episode 100 highlights

Janaki Kalaganaledu 6 Aug Today Episode : నువ్వు చేసిందే రైట్ అమ్మ

నువ్వు చేసిందే రైట్ అమ్మ. నువ్వు ఏది చెబితే అదే కరెక్ట్ అమ్మ.. అని తన తల్లికి చెబుతాడు రామా. అలాగే.. ఈ మూడు రోజులు నువ్వు ఖార్ఖానాకు వెళ్లకూడదని రామాకు చెబుతుంది జ్ఞానాంబ. అలాగే.. తనకు ఎలాంటి సాయం చేయకూడదు. ఈ మూడు రోజులు నువ్వు అసలు తనతో మాట్లాడకూడదు.. అని రామాకు చెబుతుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 6 aug 2021 episode 100 highlights

తెల్లవారగానే.. జానకి ఖార్ఖానాకు వెళ్తుంది. అక్కడ ఉన్న పనివాళ్లు అందరూ నమస్కారం అమ్మా అని అంటారు. ఆ తర్వాత అక్కడ పని ఎలా జరుగుతుందో చూస్తుంది జానకి. అయితే.. పనివాళ్లు తనను చూసి షాక్ అవుతారు. మీరేంటమ్మా ఇలా వచ్చారు.. అంటూ ఆమెను అడుగుతారు. కూర్చోండమ్మా అని చెబుతారు. అయితే.. తనకు అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పు కుట్టించినా కూడా ఎందుకు తెగిపోయింది.. అనే విషయం జానకికి అర్థం కాలేదు. అలాగే.. జానకి ఎందుకు చెప్పు కుట్టించుకురాలేదు.. అని రామా కూడా బాధపడతాడు. ఇలా.. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటారు. జానకి అయితే అబద్ధం చెప్పదు. అసలు ఏం జరిగింది.. అని రామా ఆలోచిస్తుంటాడు.

janaki kalaganaledu 6 aug 2021 episode 100 highlights

కట్ చేస్తే.. మల్లిక తెగ ఏడ్చేస్తుంటుంది. ఏమైంది మల్లిక ఎందుకు ఏడుస్తున్నావు అని తన భర్త అడగగా.. జానకికి ఎవ్వరికీ రాని కష్టం వచ్చింది. ఒక చెప్పు వల్ల.. తనకు చాలా కష్టాలు వచ్చాయి. చెప్పు కుట్టించుకురాకపోతే.. మళ్లి కుట్టించుకొని రమ్మని చెప్పాలి కానీ.. ఇలా ఖార్ఖానాలో ఉండమంటూ శిక్ష వేస్తారా? అంటే.. జానకి అబద్ధం చెప్పదు కదా.. అని అంటే.. నేను ఆ చెప్పును తెంచేశాను.. అని అసలు విషయం చెబుతుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. జానకి కలగనలేదు లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Recent Posts

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

2 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

6 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

9 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

11 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

23 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago