The Actual Number Of Seats To Be Won By YSRCP Is.!
Vijayawada : రాజకీయంగా అత్యంత కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత.. కాంగ్రెస్ రాజకీయంగా రాజ్యమేలాయి. ఇక్కడ ఆ పార్టీల్లో ఉన్న నేతలే కారణం. కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతతోనే ఇక్కడ వారికి పట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజయవాడ నగరంలో ఆ పార్టీని శాసించే నాయకులు లేరు. అయితే 2014 తర్వాత మాత్రమే టీడీపీ కూడా ఇక్కడ పుంజుకుంది.
రెండు అసెంబ్లీ.. ఒక పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజవాడ టీడీపీలో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇప్పుడు మూడు ముక్కలు అయ్యి.. చీలికలు పీలికలు అయిపోయింది. ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయకులు కూడా ఇదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారని టాక్ వినిపిస్తోంది. బెజవాడ వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉన్నా ఎవరూ కూడా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఎవరికివారుగానే రాజకీయాలు చేసుకుంటూ తమతమ వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.
దూకుడు మీదున్నా..
అదే సమయంలో తూర్పులో యువ నాయకుడు దేవినేని అవినాష్ దూకుడుగా ఉన్నారు.. అయితే.. పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వెలంపల్లి శ్రీనివాస్ మంత్రి అయినప్పటికీ వెల్లంపల్లికి, సెంట్రల్ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదని అంటున్నారు. ఇక, నగర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్పన భవకుమార్‌ను ఎవరూ లెక్క చేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం.జగన్ దగ్గర పలుకుబడి కోసం తహతహలాడడంతోనే కాలం గడిపేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఎక్కడికక్కడ గ్రూపులు, వర్గాలతో సతమతం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. బలమైన నేత వెస్ట్ లో ఉంటే, వెలంపల్లికి బ్రేక్ పడుతుందని అంచనా వెల్లువెత్తుతోంది. ఈ స్థానంపై జనసేన కన్నేసిందని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని దింపనుందని టాక్ వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం పుంజుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ దృష్టి పెడితే గానీ, కొలిక్కి రాదని కేడర్ చర్చించుకుంటోంది.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.