JanaSena : ఇప్పటి నుండే పొత్తులంటున్న జనసేనానిపై కార్యకర్తల అసంతృప్తి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 9, 2022, 8:20 am

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవరాహిత్యం పై ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2014 సమయంలో పార్టీని ప్రారంభించి అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం మరియు బిజెపి లకు మద్దతు ఇవ్వడం జరిగింది. సరే కొత్త పార్టీ కనుక వారికి మద్దతు ఇచ్చాడు.. పోటీ చేయలేదు అని అనుకుందాం. ఆ తర్వాత పొత్తు విషయంలో క్లారిటీ లేదు. 2019 ఎన్నికల సమయంలో హడావుడి తప్పితే అసలు విషయమే లేకుండాపోయింది. మళ్ళీ 2024 ఎన్నికల పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు.

ఎన్నికలు మరో రెండేళ్ల ఉండగానే పవన్ కళ్యాణ్ చేస్తున్న సందడికి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోం అంటూ ప్రకటించి.. పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చాడు. పొత్తుల విషయంలో ఇలా ఇన్ని సంవత్సరాల ముందే వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీలో నాయకులు అసంతృప్తి అవకాశం ఉంది. ప్రజల్లో కూడా ఈ పార్టీకి బలం లేదు అనే అనుమానాలు స్వయంగా అధినేత కల్పించినట్లు అవుతుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కి తెలియకపోవడంతో ఎప్పటికప్పుడు పార్టీని బలహీనం చేసుకుంటున్నాడు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

janasainiks and people don like Pawan Kalyan stand on tdp and bjp

janasainiks and people don like Pawan Kalyan stand on tdp and bjp

తెలుగుదేశం మరియు బీజేపీతో కలవాలని భావిస్తున్నాడు. ఆ విషయమై మెల్ల మెల్లగా ఇప్పటికే లైన్ క్లియర్ చేయాల్సిందిగా చూస్తున్నాడు. బీజేపీతో బాహాటంగానే పొత్తు లో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలుగు దేశంతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ టీడీపీ తో పొత్తుకు నో చెప్తే జనసేన నిర్మొహమాటంగా టిడిపి వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తెలుగు దేశం పార్టీ యొక్క మానస పుత్రుడు పవన్ కళ్యాణ్ అని.. తెలుగు దేశం పార్టీ కి అండదండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అంటూ వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తూ ఉంటారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp