
janasena leader nagababu comments on minister roja
Nagababu – Roja : వైసీపీ మంత్రి రోజా ఇటీవల మెగా బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే. తెలుగు ప్రజలు మెగా బ్రదర్స్ కి మంచి స్థానం కల్పిస్తే వాళ్లు సమాజానికి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు చంద్రబాబు సభలలో మనుషులు చనిపోతే పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఒక ఆర్టిస్టుగా పవన్ ని చూసి తోటి ఆర్టిస్టుగా నాకు చాలా సిగ్గేస్తుంది. ప్రజలకు ఎటువంటి మేలు ఈ మెగా బ్రదర్స్ చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబుని వాళ్ల సొంత జిల్లాలలోనే ప్రజలు ఓడించారు. రాజకీయంగా వీళ్ళకి భవిష్యత్తు లేదు అని రోజా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రోజా చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు
వీడియో రూపంలో ట్విట్టర్ ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “రోజా… భారత దేశ రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అసోం, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉంటే… ఏపీ 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకెళ్తే చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ ఉన్నాయి. నీవు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే…అతి త్వరలో నువ్వు పదవి దిగిపోయేలోగా ఏపీని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నీవు ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు ఏమిటో తెలుసుకో.
janasena leader nagababu comments on minister roja
పర్యాటక శాఖ మంత్రి అంటే నీవు పర్యటనలు చేయడం కాదు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో. నీవు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కల్యాణ్ గారిని నోటి కొచ్చినట్టు వాగిన కూడా… ఆఫ్ కోర్స్ నా గురించి కూడా మాట్లాడావు… నేను లెక్క చేయను. మా పార్టీ అధినేత పవన్ గారిని, అన్నయ్య చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడినా నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే… దానికి ఒకే ఒక కారణం ఉంది. నీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తూచూస్తూ ఎవడూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకడు. అదీ రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో” అంటూ రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.