Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వందల కోట్ల ఫార్మ్‌ హౌస్ పై జనసేన ఏమంటోంది? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వందల కోట్ల ఫార్మ్‌ హౌస్ పై జనసేన ఏమంటోంది?

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ గండి పేట సమీపంలో 160 కోట్ల రూపాయలతో భారీ ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నాడని.. హైదరాబాదు లోనే అత్యంత ఖరీదైన ఫార్మ్ హౌస్ గా నిలిచింది అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ పదే పదే చెప్పి పవన్ కళ్యాణ్ కి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ జనసేన […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2022,7:40 pm

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ గండి పేట సమీపంలో 160 కోట్ల రూపాయలతో భారీ ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నాడని.. హైదరాబాదు లోనే అత్యంత ఖరీదైన ఫార్మ్ హౌస్ గా నిలిచింది అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ పదే పదే చెప్పి పవన్ కళ్యాణ్ కి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ జనసేన పార్టీకి వ్యతిరేక పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పార్టీ పేరు చెప్పి భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటూ ఆయన వ్యతిరేక ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు మరియు ఫామ్ హౌస్ గురించి జరుగుతున్న ప్రచారంపై జనసేన కార్యకర్తలు స్పందిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గండిపేట సమీపంలో 16 ఎకరాల భూమిని దాదాపుగా 10 నుండి 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. ఆ సమయంలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాని రేటు 160 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కొత్తగా 160 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేదని జనసేన నాయకులు చెబుతున్నారు.

janasena leaders and fans response Pawan Kalyan rs 160 crs farm house

janasena leaders and fans response Pawan Kalyan rs 160 crs farm house

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అక్కడ పది కోట్లు ఖర్చు చేసి ఒక ఇల్లు ని నిర్మించిన మాత్రాన మొత్తం 160 కోట్లు ఖర్చు చేయడం లేదు అనేది విషయం జనసేన నాయకులు మరియు కార్యకర్తలు చెబుతున్న విషయం. పవన్‌ కళ్యాణ్‌ కు వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవం కాదని.. గతంలో తనకు వ్యవసాయం పై ఉన్న ఆసక్తితో ఆ భూమిని కొనుగోలు చేస్తే అది కాస్త ఎక్కువ రేటు వచ్చిందని పవన్‌ అభిమానులు కూడా అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది