రాపాక అంతమాట అన్నాక కూడా ఇంకా సస్పెండ్ చెయ్యవా పవన్? బుర్ర ఉందా అసలు?
ఏదో అడ్డిలో గుడ్డిమారి దెబ్బ అన్నట్టుగా.. జనసేనకు ఒక్క ఎమ్మెల్యేను గెలిపించారు ఏపీ ప్రజలు. జనసేనకు ఉన్న ఏకైక దిక్కు ఆయనే. కానీ.. గత కొన్ని రోజుల నుంచి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఝలక్ ఇస్తూనే ఉన్నారు. నిజానికి ఆయన జనసేన నుంచి గెలిచినా.. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేనకు మద్దతుగా ఏనాడూ మాట్లాడలేదు. తాను అసలు జనసేన ఎమ్మెల్యేను కాదు అన్నట్టుగా బిహేవ్ చేసేశారు. అధినేత పవన్ మాటను కూడా రాపాక ఏనాడూ ఖాతరు చేయలేదు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. తాజాగా రాపాక చేసిన పని సర్వత్రా సంచలనం సృష్టించింది. తాను వైసీపీ కార్యకర్తను అంటూ రాపాక సడెన్ షాక్ ఇచ్చారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ కార్యకర్తను అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? అనే విషయం పక్కన పెడితే… దీనివల్ల ఓవైపు జనసేన నేతలతో పాటు.. వైసీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారు.
అందులోనూ ఇటీవల తన కొడుకు వెంకటరామ్ ను వైసీపీలో చేర్పించడం.. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ.. వైసీపీ నిర్ణయాలను స్వాగతించడం.. జగన్ ను పొగడటం లాంటివి చేస్తూనే ఉన్నారు రాపాక.
దానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే బోలెడు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 30 లక్షల పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తోంది. దీనిపై ఎన్నో ఆరోపణలు కూడా వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇళ్ల పట్టాల విషయంలో జగన్ ను విమర్శించారు. కానీ.. అదే పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి రాపాక మాత్రం ఇళ్ల పట్టాల పంపిణీని ప్రశంసించారు. ఇలా ప్రతి దాంట్లోనూ రాపాక వేలు పెట్టడం.. పవన్ ను ఇరుకున పెట్టడం ఒక తంతుగా జరుగుతోంది.
మరి ఇంత జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ ఎందుకు రాపాకపై చర్యలు తీసుకోవడం లేదు అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. రాపాకపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఆయన ఇంతలా రెచ్చిపోతున్నారని.. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలంటూ జనసేన నేతలు కూడా పవన్ ను కోరుతున్నప్పటికీ.. రాపాక విషయంలో పవన్ వెనకడుగే వేస్తున్నారు.