నేను అందుకే దీక్ష చేసింది.. స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీలో నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్.. నిరసన చేపట్టారు.
అయితే.. తాను ఎందుకు దీక్ష చేపట్టానో.. పవన్ తెలిపారు. నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో తాను ఈ దీక్ష చేపట్టినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే జైకిసాన్ అనే కార్యక్రమానికి కూడా ఈ దీక్షతోనే శ్రీకారం చుట్టానని పవన్ వెల్లడించారు.
తక్షణ సాయంగా నష్టపోయిన రైతాంగానికి పదివేల సాయం చేయాలని చెప్పినా.. ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్నారని… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులంతా రైతులకు అండగా ఉంటారని పవన్ స్పష్టం చేశారు.
రైతాంగానికి 35 వేల పరిహారం ఇవ్వాలని.. అలాగైతేనే రైతులు ఊపిరి తీసుకోగలరని పవన్ చెప్పారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని పవన్ డిమాండ్ చేశారు.
నివర్ తుపాను రావడం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో సుమారు 17 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. నేను నివర్ తుపానుకు గురైన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులంతా ఆందోళనతో, ఆవేదనతో ఉన్నారు. వాళ్ల బాధలను నాకు చెప్పారు. కనీసం ఒక ఎకరంలో పంట కోసం సుమారు 50 వేలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పంట పూర్తిగా నాశనం అయింది. వాళ్ల పెట్టుబడి డబ్బులు పోయాయి. పంట పోయింది. అందుకే ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది అంటూ పవన్ డిమాండ్ చేశారు.
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి డిమాండ్ కు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా ఈ రోజు తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నారు.#JanaSenaRythuDeeksha pic.twitter.com/f9uIvaoo8s
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2020