JC Prabhakar Reddy : టీడీపీలోకి వస్తానన్న వైసీపీ నేత.. లాగి అవతల పడేసిన జేసీ
ప్రధానాంశాలు:
JC Prabhakar Reddy : టీడీపీలోకి వస్తానన్న వైసీపీ నేత.. లాగి అవతల పడేసిన జేసీ
JC Prabhakar Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా టీడీపీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీలో చేరతానని వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతను జేసీ వర్గీయులు లాగి ఇంటి బయటపడేయడం, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండడం మనం చూడవచ్చు. తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జేసీ వర్గీయుడిగా టీడీపీలో ఉన్నారు. కాని ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అంతేకాదు ఆ పార్టీలోకి వెళ్లిన వెంటనే ‘నీ గురించి నాకు అంతా తెలుసు. నీ కథ చూస్తా..’ అంటూ రెచ్చిపోయారు శ్రీనివాస్.
JC Prabhakar Reddy అస్సలు వదలం..
వరుసగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ జేసీని టార్గెట్ చేశారు. అయితే ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. తాడిపత్రిలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి విజయం సాధించారు. దీంతో శ్రీనివాస్ అనూహ్యంగా జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు.. అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీనివాస్‌ను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను కాదనుకుని వెళ్లావు కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని శ్రీనివాస్‌ను జేసీ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే శ్రీనివాస్ తాజాగా జేసీ ఇంటకి వచ్చి ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే చేతులు కట్టుకుని నిలబడ్డాడు. శ్రీనివాస్‌ను చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ‘నేను ప్రజల సమస్యలను వినాలి. నీవు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు. వెళ్లిపోవచ్చు’ అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో.. అక్కడున్న కార్యకర్తలను పిలిచి శ్రీనివాస్‌ను లాగి ఇంటి బయటకు తీసుకెళ్లి విడిచిపెట్టాలని సూచించారు. ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాస్‌ను భుజాలపై ఎత్తుకుని ఇంటి బయట వదిలేశారు. శ్రీనివాస్ మాత్రం వెనక్కు తగ్గకుండా.. ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు. అయితే జేసీ టీడీపీ నేతల సమావేశంలో పాల్గొనేందుకు రాయలచెరువుకు వెళ్లిపోయారు. కాగా, తాడిపత్రిలో రెచ్చిపోయిన కొంతమంది వైఎస్సార్సీపీ నేతల్ని మాత్రం వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.