
Jio 5G Mobile coming soon.. with amazing features..
Jio 5G Phone : ప్రముఖ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జియో ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక గతేడాది జియో ఫోన్ నెక్ట్స్‌ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించింది. ఇక తాజాగా దానికి కొనసాగింపుగా 5జీ ఫోన్ తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే దసరా కానుకగా కానీ.. ఈ ఏడాది చివరి నాటికి కానీ జియో 5జీ ఫోన్ మార్కెట్‌లోకి రానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో.. ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జియో 5జీ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉండనుందని సమాచారం. గూగుల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని జియో వర్గాలు చెబుతున్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉండనుంది. జియో 5జీ ఫోన్ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో గానీ.. సైడ్‌లో గానీ ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ ఉంటుందని అంటున్నారు. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, గూగుల్ లెన్స్, ట్రాన్స్‌లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఉండనున్నాయి.
Jio 5G Mobile coming soon.. with amazing features..
వీటితోపాటు మై జియో, జియో టీవీ ఉంటాయి. ఇతర జియో యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టుగా ఉండనుంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డ్యూయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్ ఉండనుందని తెలుస్తోంది. జియో 5జీ ఫోన్‌ను రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య విక్రయించే అవకాశం ఉంది. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలోనే వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. కేవలం రూ.2 వేల 500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎంఐలో రూపంలో నగదు చెల్లించుకునే అవకాశం ఉంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.