Jio 5G Mobile : త్వ‌ర‌లోనే జియో 5జీ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచ‌ర్స్ తో… ధ‌ర ఎంతంటే..?

Authored By aruna | The Telugu News | Published on: August 16, 2022, 7:00 am

Jio 5G Phone : ప్ర‌ముఖ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికే జియో ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకు వ‌చ్చిన సంస్థ ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక గతేడాది జియో ఫోన్‌ నెక్ట్స్‌ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించింది. ఇక తాజాగా దానికి కొనసాగింపుగా 5జీ ఫోన్ తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే దసరా కానుక‌గా కానీ.. ఈ ఏడాది చివరి నాటికి కానీ జియో 5జీ ఫోన్‌ మార్కెట్‌లోకి రానున్న‌ట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో.. ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Jio 5G Mobile : అదిరిపోయే కెమెరా ఫీచ‌ర్స్ …

జియో 5జీ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ ప్లే ఉండనుందని సమాచారం. గూగుల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ స్మార్ట్ ఫోన్‌ పనిచేయనుంది. స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని జియో వర్గాలు చెబుతున్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్‌ ఉండనుంది. జియో 5జీ ఫోన్‌ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫోన్‌ వెనుక భాగంలో గానీ.. సైడ్‌లో గానీ ఫింగ‌ర్ ఫ్రింట్ సెన్సర్ ఉంటుందని అంటున్నారు. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, గూగుల్ లెన్స్, ట్రాన్స్‌లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఉండనున్నాయి.

Jio 5G Mobile coming soon.. with amazing features..

Jio 5G Mobile coming soon.. with amazing features..

వీటితోపాటు మై జియో, జియో టీవీ ఉంటాయి. ఇతర జియో యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయ‌ని చెబుతున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టుగా ఉండనుంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డ్యూయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఉండనుందని తెలుస్తోంది. జియో 5జీ ఫోన్‌ను రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య విక్ర‌యించే అవకాశం ఉంది. జియో ఫోన్‌ నెక్ట్స్ తరహాలోనే వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. కేవలం రూ.2 వేల 500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎంఐలో రూపంలో న‌గదు చెల్లించుకునే అవ‌కాశం ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp