Job offers : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బీ రెడీ..
Job offers : నిరుద్యోగులు సంఖ్య ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం కొన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం నిరుద్యోగులకు నిజంగా గుడ్ న్యూసే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు.. కొత్త వారికి ఎక్కువగా జాబ్స్‌ను ఇవ్వనున్నాయి. కరోనా రికవరీ అనంతరం గ్రోత్ ఎక్కువకావడంతో కస్టమర్స్ డిమాండ్ భారీగా ఉండటంతో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగంలో సుమారు 70 వేల మంది ఫ్రెషర్స్‌ను నియామకాలు జరుగనున్నాయిని స్టాఫింగ్ సొల్యుషన్స్ కంపెనీ టీమ్ లీజ్ సర్వీసెస్ వెల్లడించింది.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్ఐ) రంగంలోని ఎంట్రీ లెవల్ జాబ్స్‌లో దాదాపు 25 శాతం మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు టాక్. సాఫ్ట్‌వేర్ రంగంలో సాలరీస్ పెరగడం, రియల్ ఎస్టేట్ రంగంలో రికవరీ.. బీఎఫ్‌ఎస్ఐ రంగానికి పాజిటీవ్‌గా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ బీఎఫ్‌ఎస్ఐ, గవర్నమెంట్ విభాగం స్టాఫింగ్ హెడ్ అమిత్ వదేరా వెల్లడించారు. ఈ గ్రోత్ ఫ్రెషర్ల నియామకానికి దోహదపడుతుందన్నారు. గడిచిన ఆరు నెలల్లో ఈ రంగంలో రిక్రూట్‌మెంట్ 25 శాతం పెరిగింది. ఫ్రెషర్స్ నైపుణ్యాల శిక్షణకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.దేశంలోని అతిపెద్ది ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ.. వచ్చే ఆరునెలల్లో సుమారు 2,500 జాబ్స్‌ను భర్తీ చేయనుంది.
Job offers : హెచ్‌డీఎఫ్‌సీలో 2500
వచ్చే రెండు సంవత్సరాల్లో రెండు లక్షల గ్రామాలను చేరుకోవడానికి లక్ష్యం నిర్ణయించుకుంది. ఇక శ్రీరామ్ గ్రూప్ సైతం 5000 మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్‌లో ఆరు వందల మందిని నియమించుకోవాలని భావిస్తోంది. ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ)కి ఇప్పుడు చెప్పిన ప్లేస్‌మెంట్ సీజన్ రికార్డనే చెప్పాలి. రూ.కోట్ల ప్యాకేజీతో ఐఐటీ స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్స్ సాధించారు. గడిచిన సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత సంవత్సరం ఇంటర్‌నేషనల్ ఆఫర్స్ సైతం పెరిగాయి. మద్రాసు, ఖరగ్‌పూర్, రూర్కే, గువహటి, బీహెచ్‌యూ, కాన్పూర్ ఐఐటీలు సుమారు 220 కు పైగా అంతర్జాతీయ ఆఫర్స్ పొందాయి.