Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుండి సడెన్‌గా తప్పుకున్న జో బైడెన్.. కారణం ఏంటి ?
ప్రధానాంశాలు:
Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుండి సడెన్‌గా తప్పుకున్న జో బైడెన్.. కారణం ఏంటి ?
Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సారి ఆసక్తికరంగా ఉండనున్నాయి.అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ‘డిబేట్స్’ని అత్యంత కీలకంగా అక్కడి వారు పరిగణిస్తారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే సత్తా వీటికి ఉంటాయి. జూన్ 27న డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ పేలవమైన ప్రదర్శన చేశారు. ఓటమి తర్వాత అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని జో బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది. తన పేలవ ప్రదర్శనకు.. జెట్ లాగ్, అంతర్జాతీయ ప్రయాణాలు కారణామని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. కానీ ఆయన దిగిపోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
Joe Biden బైడెన్.. తప్పుకునేన్
ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష అభ్యర్ధి రేసు నుంచి డెమోక్రటివ్ అభ్యర్ధిగా జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం తో పాటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో ఆయన ఘోరంగా వైఫల్యం చెందడం వంటి పలు కారణాలతో ఆయన ప్రెసిడెంట్ పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో అనివార్యంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అధ్యక్ష బరి నుంచి పక్కకు తప్పుకున్నట్టు తన సోషల్ మీడియా ఖాతాలో లో పేర్కొన్నారు.
తన అభిమానులు, కార్యకర్తలని ఉద్దేశించి బైడెన్ కూడా లేఖ కూడా రాసారు. ఎన్నికల 4 నెలలు ముందు బైడెన్ వైదొలగడంతో డెమోక్రాటిక్ పార్టీలో గందరగోళం నెలకొంది. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్దిగా కమలా హారిస్ కు తన మద్ధతు తెలిపారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లతో పాటు ప్రజలు .. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి అయిన డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే 59 యేళ్ల కమలా హారిస్ మద్దతు తెలిపారు. మరోవైపు పార్టీలో ఎక్కువ మంది అభ్యర్ధులు ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రైమరీల్లో 95 శాతం మంది బైడెన్ ను తమ సంఘీభావం తెలిపారు. ఆగస్ట్‌లో జరిగే ఈవెంట్లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమలా హారిస్ కచ్చితంగా అధ్యక్ష అభ్యర్థి అవుతారని డెమొక్రాట్లలో చాలా మంది విశ్వసిస్తున్నారు.