Jr NTR : టీడీపీ లీడర్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్.. కుప్పం నడిబొడ్డున రచ్చ రచ్చ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : టీడీపీ లీడర్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్.. కుప్పం నడిబొడ్డున రచ్చ రచ్చ!

 Authored By mallesh | The Telugu News | Updated on :29 November 2021,9:20 pm

Jr NTR : ఏపీలో రాజకీయాలు ఒక్కోసారి ఒక్కోలా మలుపు తిరుగుతుంటాయి. మొన్నటివరకు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగిన వార్ ఇప్పుడు టీడీపీ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్టుగా సాగుతోంది. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు ఫ్యామిలీని దూషించారని బాబు వెక్కివెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మేనత్త నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, మొదట ఈ కామెంట్స్ చేసింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అతను టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి.. ఈ సాకు చూపి వైసీపీ పార్టీ తప్పించుకుంది.

నారా భువనేశ్వరి పై చేసిన కామెంట్స్‌కు చంద్రబాబు బాధపడటంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది ఆ రోజు.. మరుసటి రోజున నందమూరి ఫ్యామిలీ నారా భువనేశ్వరికి మద్దతు నిలిచారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధరేశ్వరి ఇలా అందరూ ఏకతాటిపైకి వచ్చి వైసీపీ నాయకులను తూర్పార బట్టారు. మరోసారి రిపీట్ అయితే మేమేంటో చూపిస్తామని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏన్టీఆర్ విడుదల చేసిన వీడియోపై టీడీపీ సీనియర్ లీడర్లు వర్ల రామయ్య, బుద్ధ వెంకన్న మాట్లాడుతూ.. మీ అత్తను తిడితే ఇలాగేనా స్పందించేది అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై యంగ్ టైగర్ ఫ్యాన్ భగ్గుమంటున్నారు.

Jr ntr fans warning to tdp leaders

Jr ntr fans warning to tdp leaders

Jr NTR : ఆ ఇద్దరు లీడర్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ, టీడీపీ లీడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ రాజకీయ రొచ్చులోకి మా నాయకుడికి లాగితే బాగుండదని హెచ్చరించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా ఎస్‌ఆర్ఎం థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయొద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రచారం చేసినట్టు కూడా తెలిసింది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది