Jupiter | గురు వక్రగమనం ప్రభావం.. కన్యా, తుల, మకర, వృషభ రాశులకు అదృష్ట కాలం!
Jupiter | నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 వరకు గురు గ్రహం కర్కాటక రాశిలో వక్రగమనంలో (Retrograde motion) ప్రయాణించబోతున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, గురువు వక్రగమనంలో ఉన్నప్పుడు కొన్ని రాశులపై ఆయన అనుకూల ప్రభావం పడుతుంది. ఈ ఏడాది నాలుగు రాశులకు గురు తిరోగమనం అద్భుత ఫలితాలను అందించనుంది.
#image_title
ఈ వక్రగమనం వల్ల ఆర్థికంగా, వ్యక్తిగతంగా, విద్య & వృత్తి పరంగా గొప్ప అవకాశాలు లభించనున్నాయి. ఆ రాశులు ఏమిటో ఓసారి చూద్దాం…
1. కన్యా రాశి
గురు వక్రగమనం వల్ల కన్యా రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
విదేశీ ప్రయాణాలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి
విద్యార్థులకు మంచి ఫలితాలు
సమయానుకూలంగా శుభవార్తలు, అవకాశాలు
2. తుల రాశి
తులరాశి వారికి ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
అప్పులు తీరడం, పాత బాకీలు రికవరీ అవుతాయి
ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి
వ్యాపారంలో అధిక లాభాలు
విద్యార్థులకు మంచి ర్యాంకులు, టాప్ కాలేజీల్లో సీట్లు
3. మకర రాశి
ఈ వక్రగమనం సమయంలో మకర రాశి వారికి ఆర్థికంగా అనుకోని ఆదాయం వస్తుంది.
ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు
ఇంట్లో శుభకార్యాలు జరగడం
ఏ పని చేసినా ఫలితం సానుకూలంగా ఉంటుంది
4. వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ కాలం పట్టిందల్లా బంగారం అయ్యే సమయం.
ధనయోగం కలుగుతుంది
ఆరోగ్యం మెరుగవుతుంది
ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవుతారు
ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు
గురు వక్రగమనం జ్యోతిషశాస్త్రంలో ఒక విశిష్టమైన కాలం. ఇది అన్ని రాశులకూ ప్రభావం చూపించినప్పటికీ, కన్యా, తుల, మకర, వృషభ రాశి వారు ఈ సమయంలో అద్భుతమైన మార్పులను అనుభవించనున్నారు.