Kacha Badam : పల్లీలు అమ్ముకునే వ్యక్తి.. దశ తిప్పేసిన కచ్చా బదాం
Kacha Badam : ఇండియన్స్ అంటే ఏంటో సోషల్ మీడియాలో మరో సారి నిరూపితమైంది. పల్లీలు అమ్మకునే వ్యక్తి జీవితం ఉన్నట్టుండి తిరిగిపోయింది. అతడు పాడిన కచ్చా బదాం పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అసలు ఈ కచ్చా బదాం అనేది ఎక్కడి నుంచి వచ్చింది..? ఎందుకు ఇంత ట్రెండ్ అయింది? అంటే.. కచ్చా బదాం అనేది బెంగాలీ పదం. దీనికి పచ్చి పల్లీలు అని అర్థం. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్‌భూమ్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి..
పల్లీలను అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఆయన రకరకాల పాటలు పాడుతూ కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేవాడు. ఇందు కోసం కచ్చా బదాం అనే పాటను పాడాడు.ఇండియాలోని జానపద గేయాల్లోని రాగాలను బెంగాలీ పదాలతో కలిసి ఓ పాటను కంఠస్థం చేసుకున్నాడు. ఊరూరా తిరుగుతూ ఈ పాటను పాడుతూ ఉండేవాడు. గత నవంబర్‌లో ఒక యూట్యూబ్ వ్లోగర్.. భుబన్ పాడే పాటను వీడియో తీసి దానిని యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ఈ పాటను చూసిన వారు దాన్ని రీమిక్స్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Kacha Badam : సోషల్ మీడియాలో వైరల్
పాట అర్థం కాకపోయినా.. లిరిక్స్ ను మాత్రం నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొందరు సెలబ్రెటీలు భుబన్ దగ్గరకు వెళ్లి పాటకు సంబంధించిన రైట్స్ తీసుకునేందుకు ప్రయత్నించారు. కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, పశ్చిమ బెంగాల్‌లోని పాపుపల్ సింగర్స్ ఈ పాటకు సంబంధించిన రైట్స్ ను సొంతం చేసుకున్నారు. దీంతో భుబన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతిభ ఉన్న వారికి సోషల్ మీడియా మంచి వేదిక అని మరోసారి రుజువైంది.