kajal aggarwal | కాజల్ అగర్వాల్ ఇక లేరు అంటూ ప్రచారాలు.. దేవుడి దయ వలన అంటూ పోస్ట్
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం తన ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ అడపాదడపా సినిమాలు చేస్తుంది. మరోవైపు బిజినెస్‌లలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే సోమవారం (సెప్టెంబర్ 8) నుండి కాజల్ అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో ఓ గాసిప్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఆమె యాక్సిడెంట్‌కు గురై ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలు వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మంది మెసేజ్‌లు, ట్వీట్లు చేస్తూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీసారు. అయితే, ఈ వార్తలన్నీ ఫేక్ అని కాజల్ అగర్వాల్ స్వయంగా ఖండించారు. తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, తాను పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు.
నవ్వుకున్నాను..
“నాకు యాక్సిడెంట్ అయ్యిందన్న వార్తలు చూస్తూ నవ్వుకున్నాను. అవన్నీ అసత్యం. దేవుడి దయతో నేను బాగానే ఉన్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు, షేర్ చేయొద్దు,” అని ఆమె స్పష్టం చేశారు.అంతేకాదు, ఇటువంటి ఫేక్ న్యూస్‌లను సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇటీవల విడుదలైన “కన్నప్ప” Kannappa చిత్రంలో కాజల్ పార్వతీ దేవి పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 3 లో నటిస్తున్నారు. అలాగే, రామాయణ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె భాగమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.