Kamal Nath కాంగ్రెస్ Congress అధిష్టానంతో ప్రశాంత్ కిషోర్ prashant kishor భేటీ రాజకీయంగా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం జోరందుకుంది. కమల్‌నాథ్ కాంగ్రెస్ Congress అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీల్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కమల్‌నాథ్ Kamal Nath ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని వార్తల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే పార్టీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే Congress సమన్వయ పరచాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ prashant kishor సూచించడంతో.. ఇందుకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సమర్థుడని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్ Kamal Nath ను నియమించినా, సోనియాగాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కాంగ్రెస్ Congress పార్టీకి పూర్తికాలం అధ్యక్షులు లేకపోవడంతో కమల్ నాథ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ వచ్చేవరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఆయనను అధ్యక్షులుగా నియమిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసునే అవకాశం ఉందని తెలిస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రస్తుతం ఫ్లోర్ లీడర్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌదరి అదే బాధ్యతల్లో కొనసాగనున్నారు. అయితే, రాహుల్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పజెప్పాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ సూచించడం, పలువురు సీనియర్ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో మార్పు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఆ విషయంలో ఎలాంటి మార్పు చేయకుండా పార్టీ నాయకత్వం విషయంలో మాత్రమే కమల్ నాథ్ లాంటివారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ ను ప్రధాని అభ్యర్థిగా చేసేందుకే ప్రశాంత్ కిషోర్ prashant kishor ఈ సూచనలు చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఏమేరకు కలిసివస్తుందో మాత్రం వేచి చూడాల్సిందేనని కేడర్ చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి ==> చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఆ ఒక్కడు..?
ఇది కూడా చదవండి ==> ఆ సీనియర్ మంత్రికి సీఎం వైఎస్ జగన్ చెక్.. మంత్రివర్గ విస్తరణలో ఆయన ఔట్..?
ఇది కూడా చదవండి ==> ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ భేటీ.. రేవంత్ రెడ్డికి కలిసివచ్చేనా..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.