Kamalinee Mukherjee | ఎట్టకేలకి ఓపెన్ అయిన టాలీవుడ్ హీరోయిన్.. అందుకే దూరమయ్యానంటూ కామెంట్
Kamalinee Mukherjee | ఆనంద్… ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన కమలినీ ముఖర్జీ. ‘గమ్యం’తో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా వరకూ సినిమాలు చేసినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లోనూ నటించారు కమలినీ. గత కొంతకాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆనంద్ చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కమిలినీ ముఖర్జీ.
#image_title
ఇది కారణం..
గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి, నాగవల్లి, మా అన్నయ్య బంగారం వంటి మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు పదేళ్లుగా ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కమలినీ ముఖర్జీ 2014లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో నటించారు. ఇందులో శ్రీకాంత్ జోడీగా నటించారు. ఆ తర్వాత ఆమె తెలుగులో మూవీ చేయలేదు.
‘ఓ సినిమాలో నేను పోషించిన ఊహించిన స్థాయిలో తెరకెక్కలేదు. దీంతో ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగింది. ఈ విషయంలో నేను చాలా ఫీలయ్యా. అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదు.డైరెక్టర్ ఓ సీన్ చేయమంటారు. ఆ తర్వాత అది బాగా లేదనో మళ్లీ దాన్ని ఎడిటింగ్‌లో తీసేస్తుంటారు. ఈ విషయం నటీనటులకు చెప్పరు. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. నేను తెలుగులో అన్నీ రకాల ఎమోషన్స్ పండించా. బ ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో నాకు సరైన ఇంపార్టెన్స్ లేదని అనిపించింది. మూవీ కంప్లీట్ అయ్యాక నా రోల్ చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది.’ అంటూ చెప్పారు.