Kanpur Couples Viral : మరీ ఇంత అరాచకం ఏంటి.. పబ్లిక్‌లో బైక్‌పై రొమాన్స్ ఏంట్రా బాబు..!
ప్రధానాంశాలు:
Kanpur Couples Viral : మరీ ఇంత అరాచకం ఏంటి.. పబ్లిక్‌లో బైక్‌పై రొమాన్స్ ఏంట్రా బాబు..!
Kanpur Couples Viral : ఇటీవల కొందరు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్దలంటే భయం లేదు, పోలీసులు అన్నా కూడా టెన్షన్ లేకుండా కూడా రెచ్చిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవలి కాలంలో పర్మిషన్ లేకుండా రోడ్లపై స్టంట్స్ చెయ్యడం మనం చూస్తూ ఉన్నాం. వారిపై కఠిన శిక్షలు పెట్టిన కూడా ఎవరు మారడం లేదు. అలాంటిది ఆ జంట.. బైక్‌పై వెళ్తూ.. రొమాన్స్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. పోలీసుల యాక్షన్ మొదలైంది. ఉత్తరప్రదేశ్.. కాన్పూర్‌లోని.. గంగా బ్యారేజీ దగ్గర్లో ఈ వీడియో షూట్ చేసినట్లు తెలిసింది.
Kanpur Couples Viral : విచిత్ర ప్రవర్తన..
ఓ యువ జంట బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని ఎక్స్‌లోని @liveankitknp అకౌంట్‌లో జనవరి 10న పోస్ట్ చేశారు. “కాన్పూర్‌లో కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంట వీడియో వైరల్. గంగా బ్యారేజీ సమీపంలోని వీడియో వైరల్‌గా మారింది” అనే క్యాప్షన్ ఇచ్చారు. పోలీసుల అనుమతి లేకుండా ఇలాంటివి చెయ్యకూడదు. కానీ చాలా మంది యువత.. రీల్స్ కోసం ఇలాంటివి చేసి.. కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపో మాపో వారు అరెస్టవ్వడం గ్యారెంటీ. దీని వల్ల ఈ కేసును ఎదుర్కోకతప్పదు అని అంటున్నారు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆ జంటకు బుద్ధి, జ్ఞానం లేదు అని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే.. ఆ గంగా బ్యారేజీపై పోలీసులకు కంట్రోల్ లేదనీ, వాళ్లు సరిగా డ్యూటీ చెయ్యకపోవడం వల్లే, ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు పోలీసులకే చీవాట్లు పెడుతున్నారు. ఏది ఏమైన కూడా వారి విషయంలో ఈ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.