YS Jagan : “జగన్ నువ్ ఆ నిర్ణయం తీసుకో.. నీ కుర్చీ నిర్ణయం మేము తీసుకుంటాం” అంటోన్న కాపులు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : “జగన్ నువ్ ఆ నిర్ణయం తీసుకో.. నీ కుర్చీ నిర్ణయం మేము తీసుకుంటాం” అంటోన్న కాపులు..!

YS Jagan : కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అంశం అది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కాపు సామాజికవర్గం తమ రిజర్వేషన్లపై పోరాడింది. కానీ.. రిజర్వేషన్లు అమలు కాలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడం 2019 లో జగన్ సీఎం కావడంతో ప్రస్తుతం జగన్ వైపు కాపులు చూస్తున్నారు. ఇప్పటికే అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దానికి సుప్రీం కోర్టు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 November 2022,9:00 pm

YS Jagan : కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అంశం అది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కాపు సామాజికవర్గం తమ రిజర్వేషన్లపై పోరాడింది. కానీ.. రిజర్వేషన్లు అమలు కాలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడం 2019 లో జగన్ సీఎం కావడంతో ప్రస్తుతం జగన్ వైపు కాపులు చూస్తున్నారు. ఇప్పటికే అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దానికి సుప్రీం కోర్టు కూడా ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపాక ఇక ఆగేదేం ఉంటుంది చెప్పండి. అందుకే.. ఏపీలో కూడా రిజర్వేషన్ల కోసం కాపులు ఎదురు చూస్తున్నారు. నిజానికి.. అగ్రవర్ణాల్లో పేదలు అంటే మనకు ముందు గుర్తొచ్చేది కాపులే. వాళ్లే తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేశారు.

అప్పట్లో చంద్రబాబు.. కాపులను బీసీల్లో చేరుస్తా అని కూడా మాటిచ్చారు. కానీ.. అది కేంద్రానికి సంబంధించిన అంశం కావడంతో కాపులు ఇచ్చి మాట ప్రకారం.. బీసీల్లో చేర్చలేకపోయారు. అయితే.. 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అప్పుడే 5 శాతం చంద్రబాబు కాపులకు కేటాయించారు. కానీ.. అప్పుడు ఎన్నికల హడావుడి వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. దీంతో కాపుల అంశం అటకెక్కింది.

kapus are waiting for YS Jagan decision about kapu reservation

kapus are waiting for YS Jagan decision about kapu reservation

YS Jagan : తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న కాపులు

ప్రస్తుతం 10 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది కాబట్టి అందులో తమకు 5 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని కాపు కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి అంటే ఇప్పుడు జగన్ చేయాల్సిందే. జగన్ తీసుకునే నిర్ణయం మీదే కాపుల రిజర్వేషన్ ఆధారపడి ఉంది. మరి.. జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో ఎలాగూ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాపు సంఘాలు అదే డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్ వెంటనే కాపులకు అమలు చేస్తే ఇది టీడీపీ, జనసేన లాంటి పార్టీలకు మైనస్ అవుతుంది. ఎందుకంటే.. కాపులు మొత్తం జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. చూద్దాం మరి.. వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది