Karanam Balaram : త్వరలో సొంత గూటికి కరణం బలరాం.. కారణాలు ఇవే..!
Karanam Balaram : ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ నేడు విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, 2019 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత కరణం బలరాం ఆ తర్వాత కాలంలో వైసీపీకి మద్దతు ఇచ్చారు.
కరణం బలరాం టీడీపీని అధికారికంగా వీడనప్పటికీ వైసీపీ మద్దతుదారుగానే ఉన్నారు. అయితే, వైసీపీలో తన వారసుడు కరణం వెంకటేశ్‌కు ప్రయారిటీ ఉంటుందో ఉండదో అనే ఆలోచనలో కరణం బలరాం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరణం బలరాం కంటే కూడా ఆమంచి కృష్ణ మోహన్‌కు వైసీపీ ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ నేపథ్యంలోనే తనకు పార్టీ నుంచి ఎటువంటి లాభం జరుగుతందనే ఆలోచనలో బలరాం ఉన్నాడనే చర్చ నడుస్తుంది. అయితే, కరణం బలరాంకు టీడీపీలో చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరణం బలరాంకు గతంలో ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. 2019 సాధారణ ఎన్నికల్లో కరణం బలరాంను అద్దంకి నుంచి చీరాలకు షిప్ట్ చేసి, అక్కడ నుంచి పోటీ చేయించి గెలిపించారు కూడా.
Karanam Balaram : తనయుడి కోసమే…!
కానీ, మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కరణం వైసీపీకి మద్దతు తెలిపారు. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తన తనయుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరణం మళ్లీ టీడీపీని అఫీషియల్‌గా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే కరణం బలరాం టీడీపీపై అస్సలు విమర్శలు చేయడం లేదని టాక్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే సూచనలు కనబడుతున్న నేపథ్యంలో సామాజిక సమీకరణాల దృష్ట్యా తన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించుకోవాలని కరణం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. కరణం బలరాం త్వరలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..