Karapusa recipe :పండుగలకు ఎక్కువగా కారపూస ను చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ కారపూస గట్టిగా వస్తూ ఉంటుంది. అలా గట్టిగా రాకుండా ఇలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారపూసను ఇప్పుడు చేసి చూద్దాం. ఈ కారపుసకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, బియ్యప్పిండి, సెనగపిండి, ఆయిల్, నీళ్లు, వెన్న,పసుపు మొదలైనవి…
ఈ కారపుస తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ కి జార్లోకి రెండు గరిటెల వాముని, పది పచ్చిమిర్చిని, నాలుగైదు ఇంచల అల్లం ముక్కలని వేసి మెత్తని పేస్ట్ ల పట్టి దాన్లో మళ్లీ వాటర్ వేసి మల్లొకసారి పట్టుకోవాలి. తర్వాత దానిని బాగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి రెండు కప్పుల బియ్యప్పిండి, రెండు కప్పుల సెనగపిండి వేసి జల్లించుకొని బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం వెన్న, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దానిలో ముందుగా వడకట్టి పెట్టుకున్న వాము వాటర్ ని వేసుకుంటూ బాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇక ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఒక స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి ఎక్కిన తర్వాత మురుకులు కొట్టంతో కారపూసను ఒత్తుకోవాలి. ఇలా సన్న పూస కావాలంటే సన్నది ఒత్తుకోవచ్చు.. లేదా లావు పూస కావాలి అంటే లావు పూస కూడా ఒత్తుకోవచ్చు. ఇలా చేసుకుని ఈ కారపూస చల్లారిన తర్వాత ఎయిర్టెడ్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. అంతే ఎంతో సింపుల్ గా కొత్త వెరైటీ కారపూస రెడీ.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.