Karthika Deepam 16 Aug Episode Highlights : మోనిత శవాన్ని కార్తీక్ ఎక్కడ దాచాడో.. దీపకు చెబుతాడా? దీప ఆ విషయాన్ని ఏసీపీకి చెబుతుందా?
Karthika Deepam 16 Aug Episode Highlights : కార్తీక దీపం 16 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ 1119 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ ను చూడటానికి పోలీస్ స్టేషన్ కు దీప వెళ్తుంది. దీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కార్తీక్ తో మాట్లాడుతుంది. మిమ్మల్ని ఈ స్టేజ్ లో చూస్తానని అనుకోలేదండి అంటుంది. ఏం చేస్తాం.. అంతా నా కర్మ అంటాడు కార్తీక్. అయినా నా తలరాత ఇలా ఉంటే ఎవరిని నిందించి మాత్ర ఏంటి లాభం అంటుంది దీప. మీరు నేరం చేసినట్టు ఒఫ్పుకుంటున్నారా? చెయ్యని నేరాన్ని ఒప్పుకోవడం తప్పు కదా? అంటే నీకు నామీద అంత నమ్మకం ఏంటి దీపా? అని అడుగుతాడు కార్తీక్.

karthika deepam 16 august 2021 monday 1119 episode highlights
మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు. మోనిత కడుపులోని బిడ్డకు ఎలా కారణం అయ్యానో… ఇప్పుడు ఈ హత్యకు కూడా అలాగే కారణం అయ్యాను.. అని చెప్పారు. అప్పుడే నాకు సమాధానం దొరికినట్టే దొరికింది కానీ.. నాకు ఏం అర్థం అవడం లేదు.. అంటూ మోనిత వెక్కి వెక్కి ఏడుస్తుంది.

karthika deepam 16 august 2021 monday 1119 episode highlights
అప్పుడే పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏసీపీ రోషిణి.. దీపను చూస్తుంది. వెంటనే తనను తన గదిలోకి రావాలంటూ చెబుతుంది. వెంటనే దీప.. తన దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లాక.. కూర్చోమంటుంది ఏసీపీ మేడమ్. దీప.. ప్రశాంతంగా కూర్చున్నాక.. అప్పుడు ఏసీపీ మేడమ్.. దీపతో మాట్లాడుతుంది.

karthika deepam 16 august 2021 monday 1119 episode highlights
Karthika Deepam 16 Aug Episode Highlights : మోనిత శవాన్ని కార్తీక్ ఎక్కడ దాచాడో అడుగు.. అని దీపను కోరిన ఏసీపీ
దీప.. ఏసీపీ దగ్గరికి వెళ్లాక.. నువ్వు ఒక పని చేయాలి. దీని వల్ల నీకూ లాభం. మాకూ లాభం.. అని ఏసీపీ మేడమ్ చెబుతుంది. దీంతో చెప్పండి.. అని దీప అంటుంది. మీ అయన్ని.. మోనిత శవం ఎక్కడ దాచాడో చెప్పమను చాలు.. అని ఏసీపీ మేడమ్ అడుగుతుంది.

karthika deepam 16 august 2021 monday 1119 episode highlights
అలా అనగానే.. వెంటనే లేచి సీరియస్ గా ఏసీపీ మేడమ్ వైపు చూస్తుంది దీప. దీంతో ఏమైంది.. అని ఏసీపీ మేడమ్ ప్రశ్నిస్తుంది. ఏం కాలేదు.. మీరు చెప్పండి.. అంటుంది దీప.

karthika deepam 16 august 2021 monday 1119 episode highlights
ఒకవేళ నువ్వు కార్తీక్ తో ఈ పని చేయిస్తే మీకే మంచిది. నువ్వు, నీ పిల్లలు, నీ భర్త.. అందరూ సంతోషంగా ఉండొచ్చు. కార్తీక్ కు పడే శిక్షను నేను తగ్గిస్తాను. నేను చేయగలిగే పని మాత్ర ఇదొక్కటే.. అని దీపకు చెబుతుంది ఏసీపీ. మరి.. ఏసీపీ చెప్పినట్టు.. దీప… కార్తీక్ దగ్గరికి వెళ్లి మోనిత శవాన్ని ఎక్కడ దాచాడని అడుగుతుందా? దీప అడిగితే కార్తీక్ మోనిత శవాన్ని ఎక్కడ దాచాడో చెబుతాడా? అనేది తెలియాలంటే.. మరో ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.