Karthika Deepam 18 Aug Today Episode : కార్తీక్ ను జైలుకు పంపించి.. దీపను దూరం చేయడం కోసమే ఈ ప్లాన్ వేసిన మోనిత.. త్వరలో దీపను చంపించి

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

Karthika Deepam 18 Aug Today Episode : కార్తీక దీపం 18 ఆగస్టు 2021, బుధవారం ఎపిసోడ్ 1121 తాజాగా రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య, హిమ.. ఇద్దరు పిల్లలు పడుకొని అప్పుడే నిద్రలేస్తుంటారు. ఇంతలో హిమ లేచి దేన్నో చూసి అటు చూడు అంటుంది. దీంతో ఇద్దరు పిల్లలు షాక్ అవుతారు. దీప నేల కింద పడుకోవడం చూసి షాక్ అవుతారు. వెంటనే వెళ్లి.. అమ్మ.. అమ్మ.. అని లేపుతారు. ఏమైంది అత్తమ్మ.. ఎందుకు ఏడుస్తున్నారు.. అంటుంది. నీకేమైంది అమ్మ. బెడ్ మీద పడుకోకుండా.. నేల మీద ఎందుకు పడుకున్నావు అమ్మా. అంటే.. అక్కడ మీ నాన్న నేల మీద పడుకుంటే.. ఇక్కడ నేను పరుపు మీద ఎలా పడుకుంటాను అమ్మా.. అని తనలో తాను అనుకుంటుంది దీప. నువ్వు నాన్న గురించే ఆలోచిస్తున్నావు కదా. మాకు కూడా డాడీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది.. అని పిల్లలు అడుగుతారు.

ఈరోజు మనం ఎలాగైనా నాన్న దగ్గరికి వెళ్దాం. పదమ్మా.. నువ్వు వెళ్తున్నావు కదా. నీతో పాటు మేము కూడా వస్తాం. అంటే వద్దమ్మా.. అది మంచి చోటు కాదు అంటుంది దీప. మరి.. అది మంచి చోటు కానప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు. మేము కూడా ఈరోజు నాన్నను చూడటానికి వస్తాం.. అంతే.. లేకపోతే మా మీద ఒట్టు అని అంటుంది శౌర్య.

Karthika Deepam 18 Aug Today Episode : దీర్ఘంగా కార్తీక్ గురించి ఆలోచిస్తున్న సౌందర్య

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

కట్ చేస్తే సౌందర్య కాఫీ తాగుతూ.. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంటుంది. ఏంటి మమ్మి అంటాడు ఆదిత్య. ఇల్లు చూస్తున్నాను. పాతగా కనిపిస్తోంది. ఏదో కల తప్పినట్టుగా ఉంది. మీ అన్నయ్య ఇంట్లో లేడు కదా.. నువ్వే ఇంతలా తట్టుకోలేకపోతే.. వదిన పరిస్థితి ఏంటి మమ్మి… వదిన ఎలా తట్టుకుంటుంది.. అంటే దీపకు కార్తీక్ తో ఉండే ఎడబాటు కొత్తేం కాదు. తను ఇదివరకు కూడా ఆ బాధను అనుభవించింది. కానీ.. నాతో మాత్రం ఏనాడూ దూరం కాలేదు. నేను ఏమైనా అన్నా కూడా అమ్మే కదా అని పట్టించుకోడు. మళ్లీ నాదగ్గరికి వస్తాడు.. అని బోరున విలపిస్తుంది సౌందర్య.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

Karthika Deepam 18 Aug Today Episode : కార్తీక్ ఫోటోను చూస్తూ మైమరిచిపోయిన మోనిత

కట్ చేస్తే… మోనిత తను దాక్కొని ఉన్న రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది. తాన కాలుకు కట్టు ఉంటుంది. లేచి డైరెక్ట్ గా కార్తీక్ ఫోటో దగ్గరికి వెళ్లి తన ఫోటోను చూస్తుంది. గుడ్ మార్నింగ్ బంగారం. నీతో కలిసి ఏడడుగులు నడవాలని.. నీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ.. ఇలా అజాతంలో ఉండాల్సి వచ్చింది. కారణం.. నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ. నా ప్రేమను ఈ ప్రపంచం ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది కార్తీక్. నేనేం చేసినా అది నీ మీద పిచ్చి ప్రేమతోనే. జైలులో ఎలా ఉన్నావు.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నువ్వు అంధకారంలో ఉన్నావు. దీప మాయలో ఉన్నావు. నిన్ను దీప నుంచి దూరం చేయాలి. మీరిద్దరూ అస్సలు కలవకూడదు. అందుకే నేను చచ్చినట్టు నాటకం ఆడి నిన్ను జైలులో పెట్టించాల్సి వచ్చింది. ఇలా అయినా కొంతకాలం మీరు దూరంగా ఉంటారు కదా. నీకు శిక్ష పడేలోపు నేను వచ్చేస్తాను. కానీ.. ఆలోపు దీపను చంపేస్తా. దీపతో పాటు.. అందరినీ చంపేస్తా. ఒక్క నీ పిల్లలను తప్ప.. అందరినీ చంపేస్తా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ.. ఈ భూమ్మీద పడేలోపు నిన్ను పెళ్లి చేసుకుంటా.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

ఆ తర్వాత మన పిల్లలతో అందరం హ్యాపీగా ఉండొచ్చు. వీలైనంత త్వరగా నిన్ను చూడాలని ఉంది. దాని కంటే ముందు ఆ కనుబొమ్మలు పైకెత్తే దాన్ని పైకి పంపిస్తాను. అదే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం.. అంటూ శపథం చేస్తుంది మోనిత.

Karthika Deepam 18 Aug Today Episode : పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు బయలు దేరిన దీప

కట్ చేస్తే.. పిల్లలను తీసుకొని దీప పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతుంది. ఎక్కడికి గుడికా.. అని అడుగుతుంది సౌందర్య. దేవుడి దగ్గరికి అంటుంది.. దీప. వెళ్లి తాతయ్యకు చెప్పి రా అని అంటుంది సౌందర్య. హిమ పైకి వెళ్లేలోపు.. ఆగు.. ఎక్కడికి అని అడుగుతుంది. వాళ్లు అలాగే చెబుతారు. ఎందుకు పైకి వెళ్లడం.. అని హిమను వద్దు అంటూ వారిస్తుంది శౌర్య. అమ్మతో ఏదో మాట్లాడాలి కాబట్టి.. అందుకే మనల్ని పైకి పంపిస్తున్నారు. ఎందుకు.. మేం బయటికి వెళ్తాం.. మీరే మాట్లాడుకోండి.. అని శౌర్య.. సౌందర్యకు చెప్పి హిమను తీసుకొని బయటికి వెళ్లిపోతుంది.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

చూశావా? నీ పిల్లలు ఎంత తెలివి మీరారు. వాళ్ల దగ్గర ఏం దాచినా దాగదు. కానీ.. కొన్ని విషయాలు దాచక తప్పదు.. అని అంటుంది సౌందర్య. వాళ్లకు కొన్ని తెలియకూడదు. అందులో ఒకటి మోనిత చావు గురించి. మోనిత చావు గురించి పిల్లలకు అస్సలు తెలియకూడదు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఎవరైనా.. డాక్టరమ్మను మీ నాన్న చంపేశాడట.. అని అంటే ఆ పసిమనసులు ఏమైపోతాయో ఆలోచించు.. అని చెబుతుంది సౌందర్య.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

Karthika Deepam 18 Aug Today Episode : కార్తీక్.. తిట్టి వెళ్లిపోయాక కత్తితో గాయం చేసుకొని ఇల్లు వదిలి పారిపోయిన మోనిత

కట్ చేస్తే.. మోనిత మళ్లీ కార్తీక్ ఫోటోను చూస్తూ మైమరిచిపోతుంటుంది. తనను కార్తీక్ చంపడం కోసం గన్ పట్టుకొని వచ్చిన విషయాలను గుర్తు చేసుకుంటుంది మోనిత. కానీ.. కార్తీక్ తనను షూట్ చేయకుండానే వెళ్లిపోతుంటాడు. దీంతో కార్తీక్ ఆగు.. నా మెడలో తాళి కట్టు పెళ్లి చేసుకుందాం.. దీప గురించి ఆలోచించకు.. అని అంటుంది. దీంతో కార్తీక్ అలాగే వెళ్లిపోతుంటాడు.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

ఒరేయ్ ఆగరా.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఏంటి? దీప ఏమైపోతే మనకెందుకు.. అని మోనిత అనగానే.. ఏమన్నావే.. దీప నా భార్య. నువ్వు.. ఛీ.. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. పెళ్లి చేసుకున్నావంటే అలాంటి వన్నీ పోగొడతాను. నీకు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాను.. అని మోనిత అంటోంది. దీంతో.. నిన్ను చంపాలని కోపం ఉన్నా.. చంపలేకపోతున్నా.. నాకు చంపడం చేతకాదు.. అయినా నేను నిన్ను చంపి ఆ నేరానికి జైలుకు వెళ్లి నా భార్యను ఒంటరిదాన్ని చేయలేను.. అని చెప్పి వార్నింగ్ ఇచ్చి గుడ్ బై చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

వెంటనే ఆవేశంతో.. తన దగ్గర ఉన్న గన్ తీసుకొని ఇప్పుడు నువ్వు నీ భార్యను ఒంటరిదాన్ని చేస్తావు కార్తీక్.. అని మోనిత మనసులో అనుకొని.. ఆవేశంగా వచ్చి.. గన్ తో ఊరికే అక్కడా ఇక్కడా పేల్చుతుంది. కత్తితో తన కాలికి గాయం చేసుకొని అక్కడ అంతా రక్తం వచ్చేలా చేసి… అక్కడి నుంచి తప్పించుకుంటుంది మోనిత.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

కట్ చేస్తే పిల్లలు, దీప.. కార్తీక్ ను చూడటానికి వస్తారు. మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెడతారు డాడీ అని అడుగుతారు పిల్లలు. ఇంతలోనే ఏసీపీ మేడమ్ వచ్చి.. రత్నసీత.. నీ డ్యూటీ నువ్వు చేయి.. ఇక్కడ సెంటిమెంట్స్ కు తావు లేదు.. అంటూ కానిస్టేబుల్ పై సీరియస్ అవుతుంది. దీంతో సారీ మేడమ్.. ఆ అమ్మాయి తప్పేం లేదు.. అని కార్తీక్ ఏదో సర్ది చెప్పబోతాడు కానీ.. ఏసీపీ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. గురువారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

karthika deepam 18 august 2021 wednesday episode 1121 highlights

Recent Posts

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

17 hours ago