Categories: NewsTV Shows

Karthika Deepam 2 Today Episode: దశరథ్ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్.. తప్పించుకున్న జ్యోత్స్న.. సుమిత్రపై కొత్త ప్లాన్..దాసు కాకి కథతో భయం!

Advertisement
Advertisement

Karthika Deepam 2 Today Episode: ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్‌ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. జరిగిన పరిణామాలపై అనుమానంతో కార్తీక్ కిందకు వచ్చి ల్యాప్‌టాప్ తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయాలని నిర్ణయిస్తాడు. కెమెరా 2లో ఏమీ కనిపించకపోవడంతో కెమెరా 1 చూడమని అడుగుతాడు. అప్పుడు దశరథ్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. “ఆ కెమెరా నెల రోజుల నుంచి పనిచేయడం లేదు” అని దశరథ్ చెప్పడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ మాటలు వింటూనే జ్యోత్స్న లోపలే ఊపిరి పీల్చుకుంటుంది. నెల క్రితమే తానే కెమెరాను పాడుచేసిందన్న విషయం గుర్తొచ్చి నాన్న దాన్ని రిపేర్ చేయించకుండా మంచి పనే చేశాడని మనసులో అనుకుంటుంది. సీసీ కెమెరా పనిచేసి ఉంటే నిజం బయటపడేదని పారు అంటుండగా కార్తీక్ కూడా అవుననే తలూపుతాడు. ఈ గందరగోళంలో గ్రానీ పొరపాటు పడిందని భావిస్తూ జ్యోత్స్న అక్కడినుంచి తప్పించుకుంటుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode: దశరథ్ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్.. తప్పించుకున్న జ్యోత్స్న.. సుమిత్రపై కొత్త ప్లాన్..దాసు కాకి కథతో భయం!

Karthika Deepam 2 Today Episode: డైనింగ్ టేబుల్ దగ్గర మాటల యుద్ధం… భావోద్వేగాల తుఫాన్

తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనానికి కూర్చుంటారు. దీపను కూడా భోజనానికి పిలుస్తారు. సుమిత్ర పక్కన కూర్చోమని దశరథ్ చెప్పగా కార్తీక్ కూడా అదే మాట అనడంతో దీప కూర్చుంటుంది. దీపను వేరుగా చూపించాలనే ఉద్దేశంతో జ్యోత్స్న మిర్యాలు–బొప్పాయి విత్తనాల కథ చెబుతూ చురకలంటిస్తుంది. ఇదే సమయంలో పారిజాతం శ్రీధర్ విషయంలో మాటల దాడి చేస్తుంది. అడ్డదారిలో ఫ్యామిలీలోకి వచ్చావు ఇష్టం లేని కాంచన వెనుక తిరుగుతున్నావు. నిజానికి నువ్వు కావేరి దగ్గర ఉండాలి అంటూ తిడుతుంది. ఇంతలో కావేరికి విడాకులు ఇస్తున్నావా అని పారిజాతం ప్రశ్నించడంతో కార్తీక్ కోపంగా స్పందిస్తాడు. పారు అని అరిచినందుకు పారునే గద్దిస్తాడు. శివ నారాయణ కూడా పారిజాతాన్ని మందలిస్తూ ప్రతిదాంట్లో విషం కలుపుతున్నావా అని హెచ్చరిస్తాడు. ఇదే సమయంలో సుమిత్ర భావోద్వేగంగా మాట్లాడుతుంది. తనకు బతుకుతానన్న నమ్మకం లేదని కనీసం కూతురు పెళ్లి చూడాలన్నదే తన కోరిక అని చెప్పడంతో అందరూ బాధపడతారు. అప్పుడు జ్యోత్స్న ధైర్యంగా మాట్లాడి మమ్మీ నిన్ను నేను కాపాడుకుంటాను. నీ పెళ్లి చేయిస్తాను నీ మనవళ్లతో ఆడుకుంటావ్ అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పడం కార్తీక్‌కు డౌట్‌ను పెంచుతుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న మైండ్ గేమ్… దాసుతో ఫోన్ కాల్..చివరి షాక్

ఇంతలో శౌర్య టెర్రస్‌పై ఆడుకుంటున్నట్టు చెబుతుంది. సుమిత్ర శౌర్యకు అన్నం తినిపిస్తుండగా జ్యోత్స్న మనసులో మరో లెక్క వేస్తుంది. తన ప్లాన్ నెమ్మదిగా నిజమవుతుందని భావిస్తుంది. మరోవైపు దీప కార్తీక్‌తో మాట్లాడుతూ జ్యోత్స్న దగ్గర ఏదో ప్లాన్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో పారిజాతం జ్యోత్స్నను నిలదీస్తే నీకు చెప్పను గ్రానీ అంటూ తప్పించుకుంటుంది. మనసులో మాత్రం తాను దాచిన డబ్బు ఇంటి నుంచి వెళ్లిపోయాక జరిగే పరిణామాలన్నీ లెక్కలు వేసుకుంటుంది. తర్వాత కార్తీక్‌కు ఫోన్ రావడంతో అతను బయటకు వెళ్తాడు. ఇదే అవకాశంగా జ్యోత్స్న రౌడీకి కాల్ చేసి దాసుతో స్పీకర్‌లో మాట్లాడుతుంది. దాసు చెప్పిన కాకి కథ నిజం ఉదయించే సూర్యుడిలాంటిది అన్న మాటలు జ్యోత్స్నను హెచ్చరిస్తాయి. దీపను ఏమీ చేయొద్దని దాసు చెప్పినా నన్నెవరు ఆపలేరు నాన్న అంటూ కాల్ కట్ చేస్తుంది. అంతలో వెనక్కి తిరిగిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ సీన్‌తోనే నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసి, రేపటి ఎపిసోడ్‌పై భారీ ఆసక్తిని పెంచింది.

Recent Posts

Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క

Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…

43 minutes ago

Post Office Franchise 2026: తక్కువగా ఖర్చుతో సొంతంగా బిజినెస్ చేయాలనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ అద్భుత అవకాశం

Post Office Franchise 2026: రూ. 5,000 పెట్టుబడితో నెలకు వేలల్లో ఆదాయం! సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా…

2 hours ago

Komaki XR7: ఒక్క ఛార్జింగ్‌తో 322 కిలోమీటర్లు.. ఈవీ రంగంలో కొత్త సంచలనం!

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…

3 hours ago

Aadabidda Nidhi Scheme : మరో కీలక హామీని అమలు చేయబోతున్న ఏపీ సర్కార్

Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…

4 hours ago

Anil Ravipudi : అప్పుడే 2027 సంక్రాంతి కాంబో ను సెట్ చేసిన అనిల్ రావిపూడి

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…

5 hours ago

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..మీ ఖాతాల్లోకి రూ. 46,000 జమ ! చెక్ చేసుకోవడం ఎలా అంటే !!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వేతన జీవులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పిఎఫ్ ఖాతాల్లో…

6 hours ago

No Cost EMI : నో కాస్ట్ EMI అనగానే అబ్బా అనుకోకండి..వారి మోసం తెలిస్తే వామ్మో అనాల్సిందే !!

No Cost EMI : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మనకు తరచుగా వినిపించే ఆకర్షణీయమైన పదం 'నో కాస్ట్ ఇఎంఐ'…

7 hours ago

ప్రియుడి భార్య పై పగతో మాజీ ప్రియురాలు ఏంచేసిందో తెలిస్తే..ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని షాక్ అవుతారు !!

Ex Lover : భర్త మహాశయులకు విజ్ఞప్తి..రోజు రోజుకు అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో భర్తలు హతం అవుతున్నారు.…

7 hours ago