Karthika Deepam 2 Today Episode: శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్..జ్యోత్స్న తెలివైన మాటలు..అనుమానాల మంట రేపిన కాంచన!
ప్రధానాంశాలు:
Karthika Deepam 2 Today Episode: శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్..జ్యోత్స్న తెలివైన మాటలు..అనుమానాల మంట రేపిన కాంచన!
Karthika Deepam 2 Today Episode : ఈరోజు ఎపిసోడ్‌లో డాక్టర్ ఇవాళ రారని నమ్మకంగా జ్యోత్స్న ఇంటి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ అనుకోకుండా డాక్టర్ హారిక రావడంతో జ్యోత్స్న పూర్తిగా కంగుతింటుంది. తాను ముందుగా తెలుసుకున్న సమాచారం ప్రకారం డాక్టర్ వేరే సర్జరీకి వెళ్లాలి రిపోర్ట్స్ కూడా ఇవాళ రావు. కానీ ఆ ప్లాన్ అంతా తలకిందులవుతుంది. డాక్టర్ వచ్చి నేరుగా సంచలన విషయం బయటపెడుతుంది. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్..ఆమె తల్లితో మ్యాచ్ కాలేదని స్పష్టంగా చెబుతుంది. ఈ మాట విన్న వెంటనే ఇంట్లో అందరూ షాక్‌కు గురవుతారు. కార్తీక్ కూడా ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తాడు. రెండు మూడు సార్లు టెస్టులు చేశామని పొరపాటు లేదని డాక్టర్ చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది.
Karthika Deepam 2 Today Episode: శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్..జ్యోత్స్న తెలివైన మాటలు..అనుమానాల మంట రేపిన కాంచన!
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ మీదే నింద..కెనడా ప్లాన్‌తో జ్యోత్స్న ఎస్కేప్
అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో జ్యోత్స్న ఒక్కసారిగా దూకుడుగా మారుతుంది. శాంపిల్స్ మ్యాచ్ కాకపోతే తప్పు డాక్టర్‌దే అంటూ ఎదురుదాడికి దిగుతుంది. టెస్టులు సరిగా చేయలేని డాక్టర్లు డబ్బుల కోసం హాస్పిటల్స్ అబద్ధాలు చెబుతాయని ఘాటుగా మాట్లాడుతుంది. తన బ్లడ్ శాంపిల్స్ వేరే వాళ్లతో కలిసిపోయి ఉండొచ్చని అందుకే ఈ రిజల్ట్స్ వచ్చాయని తెలివిగా కవర్ చేస్తుంది. పారిజాతం కూడా జ్యోత్స్నకు మద్దతుగా మాట్లాడుతూ హాస్పిటల్స్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇక ఇక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకోవడం వ్యర్థమని కెనడాకు వెళ్లి అక్కడ తన ఫ్రెండ్ దగ్గర చికిత్స చేయిస్తామని జ్యోత్స్న కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ మాటలు విన్న కార్తీక్ మాత్రం దేశం దాటి పారిపోవాలన్నదే అసలు ప్లాన్ అని లోపల అనుమానపడతాడు. దశరథ్ మాత్రం జ్యోత్స్న ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్‌తో మాట్లాడే తీరు సరిగా లేదని హెచ్చరిస్తాడు. అయినా డాక్టర్ హారిక రిపోర్ట్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Karthika Deepam 2 Today Episode: కాంచన గట్టి ప్రశ్నలు.. జ్యోత్స్న నిజంగా ఎవరు?
ఎపిసోడ్ చివర్‌లో అసలు ట్విస్ట్ వస్తుంది. కాంచన జ్యోత్స్న మరియు పారిజాతంను గట్టిగా నిలదీస్తుంది. రిపోర్ట్స్ రాకముందే వీళ్లిద్దరిలో కనిపించిన భయం తనకు అనుమానాలు రేకెత్తించిందని చెబుతుంది. శాంపిల్స్ మ్యాచ్ కావని ముందే వీళ్లకు తెలుసని స్పష్టంగా అంటుంది. ఇదంతా చూస్తుంటే జ్యోత్స్న తన అన్నయ్య సొంత కూతురు కాదేమో అనే డౌట్ తనకు బలంగా కలుగుతోందని కాంచన చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది. ఈ మాటలు విన్న శ్రీధర్ కూడా షాక్ అవుతాడు. జ్యోత్స్న అసలు నేపథ్యం ఏంటి? పారిజాతం దాస్తున్న నిజం ఏమిటి? అన్న ప్రశ్నలతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్‌లో డ్రామా, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ కలగలిసి ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేశాయి. రాబోయే ఎపిసోడ్స్‌లో జ్యోత్స్న రహస్యాలు బయటపడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.